త‌ల లేకుండా 18 నెల‌లు బ‌తికిన కోడి చ‌రిత్ర..మీకోసం.!

ఓ కోడి త‌ల లేకుండా 18 నెల‌లు బ్ర‌తికి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ” Mike The Headless Chicken” పేరిట ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపుపొందింది. ఇప్పుడు ఆ వండ‌ర్ కోడి చ‌రిత్ర గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.!

అది 1945 సెప్టెంబ‌ర్ 10, అమెరికాలోని కొల‌రాడో లో….లాయ్డ్ ఓస్లెన్ అనే రైతు ఇంటికి అత‌ని అత్త‌య్య వ‌చ్చింది. ఇంటికొచ్చిన అత్త కోసం రాత్రి డిన్న‌ర్ లో కోడి కూర సిద్దం చేయాల‌నుకొని.. త‌నకున్న కోళ్ళ‌లో ఓ కోడిని ప‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నించాడు ఓస్లెన్…అత‌న్ని చూసి కోళ్ల‌న్నీ చెల్లాచెదుర‌య్యాయి…ఓస్లెన్ కు చిర్రెత్తుకొచ్చింది … ఈ క్ర‌మంలో ఓ క‌త్తి తీసుకొని కోళ్ళ మీద‌కు విసిరాడు…అలా విసిరిన క‌త్తి ఓ కోడి త‌ల‌కు త‌గిలింది. త‌గ‌ల‌డం త‌గ‌ల‌డ‌మే దాని తల తెగి ప‌డింది. విచిత్రమేంటంటే…ఆ కోడి కొక్కొరొకో అంటూ తెగిన మొండెంతోనే అరుస్తూ అక్క‌డి నుండి పారిపోయింది.!

గంట త‌ర్వాత కూడా ఆ కోడి తెగిన మొండెంతో స‌జీవంగా క‌నిపించ‌డంతో ఆశ్చ‌ర్య‌పోయాడు ఓస్లెన్….! ఇక ఆరోజు నుండి ఆ కోడికి మైక్ అని పేరుపెట్టి అల్లారుముద్దుగా చూడ‌డం స్టార్ట్ చేశాడు ఓస్లెన్…తెగిన త‌ల ద‌గ్గ‌ర ఉన్న రంద్రం నుండే దానికి కావాల్సిన నీటిని, దాణాను అందించ‌డం స్టార్ట్ చేశాడు. అలా ఆ కోడి వార్త అమెరికా అంత‌టా పాకిపోయింది.! వండ‌ర్ మైక్ గా అమెరికా అంత‌టా పాపులారిటీని సంపాదించుకున్న మైక్…మార్చ్ 17, 1947 న‌…….గొంతులో క‌ణితి కార‌ణంగా తిన‌డానికి క‌ష్ట‌త‌ర‌మై చనిపోయింది. 18 నెల‌ల పాటు త‌ల లేని కోడిగా జీవించి త‌న‌కంటూ ఓ చ‌రిత్ర‌ను సృష్టించుకుంది మైక్.

Comments

comments

Share this post

scroll to top