ప్ర‌పంచంలోనే..చేతిరాత‌తో న‌డిచే ఏకైక న్యూస్ పేప‌ర్.! దాని ఖ‌రీదు 75 పైస‌లు.!

టెక్నాల‌జీ పెరిగిపోతుంది. ఎంత‌గా అంటే న‌ర్స‌రీ చ‌దువులు కూడా ట్యాబ్స్ ద్వారా నేర్చుకునేంత‌గా….ఇలాంటి జెన‌రేష‌న్ లో కూడా ఓ ప‌త్రిక పూర్తిగా చేతిరాత‌తో న‌డుస్తుంది. ఆ ప‌త్రిక ఆఫీస్ లో టైపింగ్ మెషీన్స్ కానీ, కంప్యూట‌ర్స్ కానీ ఉండ‌వు…కేవ‌లం ముగ్గురు కాలిగ్రాఫ‌ర్స్ ( చేతిరాత నిపుణులు ) మాత్ర‌మే ఉంటారు…ఈ ముగ్గురు క‌లిసి పేప‌ర్ మొత్తాని పెన్ తో రాస్తారు.! త‌ర్వాత ఆ కాపీని స్కాన్ చేసి ప్రింట్ కొడ‌తారు.!

“The Musalman” అనే ఈ ప‌త్రిక‌ను 1927 లో అజ్మ‌త్ అనే వ్య‌క్తి 1927 లో ప్రారంభించాడు…త‌మ క‌మ్యూనిటీ ప్రాబ్ల‌మ్స్ ను ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తూ, ఇత‌ర రాజ‌కీయ సామాజిక విష‌యాల గురించి కూడా రాసేవాడు…. అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఆ ప‌త్రిక కేవ‌లం చేతిరాత ద్వారానే వెలువ‌డుతుండ‌డం విశేషం…ఇప్పుడు ఈ పత్రిక‌ను అజ్మ‌త్ మ‌న‌వ‌డు ఆరిఫ్ న‌డుపుతున్నాడు.

21,000 కాపీలు అమ్ముడ‌వుతున్న “The Musalman” ప‌త్రిక ఖ‌రీదు 75 పైస‌లే…ప్ర‌పంచంలోనే అతి త‌క్కువ కాస్ట్ క‌లిగిన పత్రిక కూడా ఇదే కావ‌డం విశేషం.! ఈ ప‌త్రిక చేతితో రాసిన వార్త‌ల‌ను అందించ‌డ‌మే కాకుండా….. ఉర్థూ కాల‌గ్ర‌ఫీ స్కిల్ ను స‌జీవంగా బావి త‌రాల‌కు అందిస్తుంది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top