చేతి వేళ్లను బట్టి వ్యక్తి స్వభావం… మరి మీరే టైపో తెలుసుకోండి.!?

మన భవిష్యత్ మన చేతి వేళ్ళపై ఆధారపడి ఉందట..! శాస్త్రం చెప్పింది..అదే జ్యోతిష్య శాస్త్రమండీ…!  ఇలాంటివి చెబుతుంటే మీ భవిష్యత్ ఎలా ఉందో, మీరు ఎలాంటి స్వభావం కలవారో తెలుసుకోవాలనుంది కదా. జ్యోతిషులు చెప్పే విషయాలను ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్న మనం, ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. అదేంటంటే మన చేతి వేళ్ళ ఆకారాలను బట్టి మన స్వభావం ఏంటో తెలుసుకోవచ్చు, మన భవిష్యత్ ఎలా ఉందో గ్రహించవచ్చు. ఒక వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉంది అనేది చెప్పడానికి అతని చేతివేలు ఆకారం బట్టి చెప్పవచ్చంట. అది ఆడవాళ్లైనా సరే మగవాళ్లైనా.

మన చూపుడు వేలు ఒక వ్యక్తి సభావాన్ని ఎలా తెలియజేస్తుందంటే.. 
మన చూపుడువేలు, మధ్యవేలుకు గోరు స్టార్టింగ్ పాయింట్ కు సమానంగా ఉన్న వారు,  అందరిపైనా ఆధిపత్యం చూపిస్తారట. అలాగే వీరికి కొంచెం కోపం ఎక్కువ, ఇతరులను గౌరవించటానికి ఇష్టపడరు  మరియు  అహంకార స్వభావులు.
1
ఒకవేళ చూపుడువేలు మధ్యవేలు కన్నా పెద్దదిగా ఉన్నవారు చాలా అహంకారంగా ఉంటారట. అలాగే నేను ఎవరి ముందూ తక్కువకాదు, నా తర్వాతే ఎవరైనా అనే విశ్వాసం ఎక్కువగా అని ఆలోచిస్తారు.
3_1448617733
తమ చూపుడువేలు  ఇతర వేల్లతో పోల్చితే చాలా చిన్నదిగా ఉన్నట్లయితే, ఆశ స్వభావం ఎక్కువ ఉన్నవారని ఏదైనా ప్రతిష్టాత్మకంగా భావిస్తారట. అయితే ఏ పని చేసినా సరే అందులో ఆనందం కోరుకోరట.
3
ఉంగరం వేలు కన్నా చూపుడు వేలు పొడవుగా ఉన్న వారు చాలా ఆశగల వారంట. ప్రతి చిన్న విషయానికీ ముందే అత్యుత్సాహపడిపోతూ తమ చేసే పనిని ఆసక్తిగా చేయకుండా ఆ పనిని నాశనం చేస్తారట.
10_1448617735
ఒకవేళ ఉంగరం వేలు, చూపుడు వేలు సమానంగా ఉన్నట్లయితే వారు డబ్బు బాగా సంపాదిస్తూ, సమాజంలో గౌరవం పొందుతారు. అదే చూపుడు వేలు గనుక ఉంగరం వేలు కంటే పొట్టిగా ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థుతుల్లోనైనా చాలా ప్రశాంతంగా ఉంటారట. మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుందని భావిస్తారు.
( నమ్మే వారికి మాత్రమే….టివిలో  రంగురాళ్ల యాడ్ లాంటిదన్న మాట..షరతులు వర్తిస్తాయ్)

Comments

comments

Share this post

scroll to top