రాత్రికి రాత్రే సోష‌ల్ మీడియాలో ఈ పంజాబ్ లేడీ పోలీస్ ఆఫీస‌ర్ ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ఎందుకో తెలుసా..?

నేటి త‌రుణంలో మ‌న‌పై సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఎంత‌లా ప‌డుతుందో అంద‌రికీ తెలిసిందే. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు సోష‌ల్ మీడియాలోనే ఎక్కువగా మ‌నం విహ‌రిస్తున్నాం. ఈ క్ర‌మంలోనే అందులో మ‌న‌కు వ‌చ్చిన‌, మనం క్రియేట్ చేసిన అనేక విష‌యాల‌ను, ఫొటోలను, వీడియోల‌ను షేర్ కూడా చేసుకుంటున్నాం. అయితే ఇలాంటి వాటిలో నిజం ఎంతో, అబ‌ద్దం ఎంతో తెలియ‌డం లేదు. మ‌న‌కు సోష‌ల్ మీడియాలో ఒక ఫొటో, వీడియో లేదా పోస్ట్ ఆస‌క్తిక‌రంగా క‌నిపించిందంటే దాన్ని వెనుకా ముందు చూడ‌కుండా షేర్ చేస్తున్నాం. కానీ అది అస‌లు నిజ‌మేనా, అందులో నిజం ఉందా ? అని ఆలోచించ‌డం లేదు. తాజాగా ఓ న‌టికి చెందిన ఫొటో కూడా ఇలాగే వైర‌ల్ అయింది. దాన్ని నిజ‌మే అని చాలా మంది నెటిజ‌న్లు న‌మ్మి ఆ ఫొటోను షేర్ చేశారు. ఆ త‌రువాత నిజం తెలిసి నాలుక క‌రుచుకున్నారు.

#comingtolifesoon #kainaatarora As #harleenmaan @jeetkalsi9 @mikasingh presents #jaggajiyuandae makeup : @rajus_makeup

A post shared by Kainaat Arora ( Babyjaan ) (@ikainaatarora) on

Day 2 🎬🎬🎬 #shooting 🎬🎬#songShoot #worklife #RDLstudio

A post shared by Kainaat Arora ( Babyjaan ) (@ikainaatarora) on

ఆమె పేరు కైన‌త్ అరోరా. పంజాబ్‌కు చెందిన సినిమా న‌టి. అయితే ఈమె తాజాగా JAGGA JIUNDAE అనే సినిమాలో న‌టిస్తోంది. అందులో ఆమె పేరు హ‌ర్లీన్ మాన్‌. ఆమెది ఒక పోలీసు పాత్ర‌. అందులో భాగంగానే ప‌లు సీన్ల కోసం ఆమె చిత్ర యూనిట్‌తో పాల్గొని ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటో షూట్‌లో కైన‌త్ పోలీస్ ఆఫీస‌ర్ డ్రెస్ వేసుకుని ఫొటోలు దిగింది. అనంత‌రం వాటిని త‌న ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అయితే కైన‌త్ అలా పోలీస్ ఆఫీస‌ర్ డ్రెస్ వేసుకుని తీయించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. కేవ‌లం 3, 4 రోజుల వ్య‌వ‌ధిలోనే ఆ ఫొటోల‌ను అనేక ల‌క్ష‌ల మంది చూశారు. త‌మ త‌మ వాట్సాప్ కాంటాక్ట్‌లు, గ్రూప్ ల‌తోపాటు ఫేస్‌బుక్ అకౌంట్ల‌లోనూ ఈ ఫొటోల‌ను షేర్ చేశారు.

Day 2 🎬🎬🎬 #shooting 🎬🎬#songShoot #worklife #RDLstudio

A post shared by Kainaat Arora ( Babyjaan ) (@ikainaatarora) on

నిజంగా ఇంత‌టి అంద‌మైన పోలీస్ ఆఫీస‌ర్ ఉంటే నేను వెంట‌నే నా నేరానికి లొంగి పోతా.., మేడ‌మ్ ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయండి.., మేడమ్ మీకు నేను స‌రెండ‌ర్ అయిపోతా.. అంటూ చాలా మంది నెటిజ‌న్లు కైన‌త్ అరోరా పోలీస్ ఫొటోల‌కు కామెంట్లు పెట్టారు. దీంతో కైన‌త్ స్పందించింది. తాను పోలీస్ ఆఫీస‌ర్‌ను కాన‌ని, JAGGA JIUNDAE అనే సినిమాలో న‌టిస్తున్నాన‌ని, త‌న పేరు హ‌ర్లీన్ మాన్ కాద‌ని, అది సినిమాలో త‌న పాత్ర పేర‌ని, సినిమా కోసం పోలీస్ డ్రెస్ వేసుకున్నా కానీ, తాను పోలీస్ ఆఫీస‌ర్‌ను కాన‌ని చెప్పింది. దీంతో ఈ విష‌యం తెలుసుకున్న నెటిజ‌న్లు కాస్తా ఇప్పుడు నాలిక్క‌రుచుకుంటున్నారు. అస‌లేదో, నిజం ఏదో సోష‌ల్ మీడియాలో తెలుసుకోకుండా స్పందిస్తే.. రిజ‌ల్ట్ ఇలాగే ఉంటుంది మ‌రి..!

 

Comments

comments

Share this post

scroll to top