అందంగా లేవని చాణక్యుడిని అవమానించాడు ఓ రాజు…పగ పట్టి అతని రాజ్యాన్ని లేకుండా ఎలా చేసాడో తెలుసా.?

చాణక్యుడి గురించి మ‌న‌కు అంద‌రికీ తెలిసిందే. ఇత‌ను మొదటి మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా, తక్షశిల విశ్వవిద్యాలయం లో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షుడిగా ప‌నిచేశాడు. ఇత‌ను ఓ గొప్ప రాజ‌నీతిజ్ఞుడు. బాగా తెలివి ఉన్న‌వాడు. ఇత‌న్ని కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణుడిగా ప్ర‌సిద్ధిగాంచాడు. అయితే చాణ‌క్యుడి జీవిత గాథ‌కు సంబంధించి ప‌లు వ‌ర్గాల్లో భిన్న‌మైన క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బుద్ధిస్ట్ వెర్ష‌న్ ప్ర‌కారం చాణ‌క్యుడి క‌థ ఇలా చెబుతారు… చాణ‌క్యుడికి చిన్న‌త‌నంలో కుక్క‌ల‌ను పోలిన దంతాలు ఉండేవ‌ట‌. దీంతో అత‌ని త‌ల్లి దిగులు చెందేద‌ట‌. అయితే త‌ల్లి దిగులు చెందుతుంద‌ని తెలిసి చాణ‌క్యుడు త‌న దంతాల‌ను తానే ప‌గ‌ల‌గొట్టుకుంటాడు. ఈ క్ర‌మంలో చాణ‌క్యుడు పెద్ద‌గ‌య్యాక మంచి విద్యాపారంగ‌తుడు అవుతాడు. అనేక విద్య‌ల్లో ఆరితేరుతాడు. అయితే అత‌ను బ్రాహ్మ‌ణుడు కనుక పాట‌లీపుత్ర రాజు ధ‌నానంద ద‌గ్గ‌ర‌కు వెళితే జీవనం సాగించ‌వ‌చ్చని అనుకుంటాడు. కానీ అత‌నికి అక్క‌డ రాజ స‌భ‌లో అవ‌మానం జ‌రుగుతుంది. దీంతో చాణ‌క్యుడు ధ‌నానంద‌పై ప్ర‌తిజ్ఞ చేస్తాడు. ఎప్పటికైనా ప్ర‌తీకారం తీర్చుకుంటాన‌ని చెప్పి అడ‌వుల‌కు వెళ్ల‌గా అక్క‌డ బాల్య వ‌య‌స్సులో ఉన్న చంద్ర‌గుప్తుడు క‌నిపిస్తాడు. అత‌నికి ప‌రీక్ష‌లు పెట్ట‌గా రాజు అయ్యేందుకు అర్హ‌త‌లు ఉన్నాయ‌ని గ‌మ‌నించి చంద్ర‌గుప్తున్ని అన్ని అంశాల్లోనూ తీర్చిదిద్దుతాడు. ఈ క్ర‌మంలో యుక్త వ‌య‌స్సుకు వ‌చ్చిన చంద్ర‌గుప్తునితో క‌లిసి చాణుక్యుడు పాట‌లీ పుత్రంపై దండెత్తుతాడు. మొద‌టి ప్ర‌య‌త్నంలో విఫ‌లం అయినా రెండో ప్ర‌య‌త్నంలో మాత్రం ధ‌నానందున్ని చంద్రగుప్తుడు ఓడించి చంపుతాడు. దీంతో చాణక్యుని ప్ర‌తిజ్ఞ నెర‌వేరుతుంది.

ఇక చాణ‌క్యుడి క‌థ‌ను జైనులు మ‌రోలా చెబుతారు. అయితే ఈ క‌థ పై క‌థ‌ను పోలి ఉంటుంది. కాక‌పోతే చాణ‌క్యుడి దంతాల‌ను చిన్న‌త‌నంలో అత‌ని తండ్రే ప‌గ‌ల‌గొట్టిన‌ట్టు జైనుల క‌థ‌లో ఉంటుంది. మిగిలిన‌దంతా దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఇక కాశ్మీరీలు చాణ‌క్యుడి క‌థ‌ను మ‌రోలా చెబుతారు. చాణ‌క్యుడు ధ‌నానందుని కొలువులో పండితుడు. అయితే శ‌క‌త‌ల అనే మంత్రిని ధ‌నానందుడు బంధిస్తాడు. ఈ క్ర‌మంలో త‌న‌ను విడిపిస్తే 1000 బంగారు నాణేల‌ను ఇస్తాన‌ని శ‌క‌త‌ల చాణ‌క్యుడికి చెబుతాడు. చాణ‌క్యుడు అలాగే చేస్తాడు. కానీ బంగారు నాణేలు ఇవ్వ‌డు. దీంతో చాణ‌క్యుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తాడు. ఈ క్ర‌మంలో రాజును చంపితే ఆ మొత్తం ఇస్తాన‌ని శ‌క‌త‌ల అంటాడు. దీంతో చాణ‌క్యుడు త‌న‌కు ఉన్న మంత్ర శ‌క్తితో ధ‌నానందున్ని చంపేస్తాడు.

కాగా ముద్ర ర‌క్ష‌ణ ప్ర‌కారం చాణ‌క్యుడి క‌థ మ‌రోలా ఉంటుంది. చాణ‌క్యుడు ధ‌నానందుని కొలువులో నుంచి అక‌స్మాత్తుగా తొల‌గింప‌బ‌డ‌తాడు. దీంతో ధ‌నానందునిపై ప‌గ‌బ‌ట్టిన చాణ‌క్యుడు చంద్ర గుప్తున్ని క‌లిసి అత‌నితో ధ‌నానందునిపై దండెత్తి పాట‌లీపుత్రాన్ని కైవ‌సం చేసుకుని త‌న ప్ర‌తీకారం తీర్చుకుంటాడు. అయితే చాణ‌క్యుడి గురించి పైన చెప్పిన క‌థ‌ల‌న్నీ ప్ర‌చారంలో ఉన్న‌వే. వీటిలో అస‌లైంది ఏది ? అని ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ తేల్చి చెప్ప‌లేక‌పోయారు..!

Comments

comments

Share this post

scroll to top