సొంతంగా పండించిన పదార్థాలతో భక్తులకు భోజనం పెడుతున్న గుడి.!

నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో జంక్ ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ను జ‌నాలు అధికంగా తింటున్నారు. వీటిల్లో ఉండే ర‌సాయ‌నాలు మ‌న‌కు ఏ విధంగా హాని క‌లిగిస్తాయో అంద‌రికీ తెలిసిందే. అయితే కేవ‌లం ఇవే కాకుండా నిత్యం ఇళ్ల‌లో ఆహారం వండేందుకు ఉప‌యోగించే కూర‌గాయ‌లు, ప‌ప్పులు, బియ్యం, ధాన్యాల పిండి వంటి ప‌దార్థాల్లో కూడా ర‌సాయ‌న అవ‌శేషాలు మిగిలే ఉంటున్నాయి. వీటి వ‌ల్ల కూడా దీర్ఘ‌కాలికంగా మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్యాలు సంభ‌విస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అత్యంత స‌హ‌జ సిద్ధంగా ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో పండిన ప‌దార్థాల‌తో త‌యారు చేసిన వంట‌కాల‌ను తిన‌డం మ‌న‌కు ఇప్పుడు అత్యంత ఆవ‌శ్య‌కంగా మారింది. స‌రిగ్గా ఇదే విష‌యాన్ని గుర్తించిన అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్ ఆల‌య క‌మిటీ వారు స‌హజ సిద్ధంగా పండిన కూర‌గాయ‌ల‌ను వంట‌ల కోసం ఉప‌యోగిస్తున్నారు. క్రిమి సంహార‌క మందులు ఏవీ వాడ‌కుండానే ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో పండిన కూర‌గాయ‌లు, ధాన్యాల‌తో వండిన ఆహారాన్ని టెంపుల్ సంద‌ర్శ‌కుల‌కు అతి త్వ‌ర‌లో అందించ‌నున్నారు.
సిఖ్ వ‌ర్గీయుల‌కు చెందిన శిరోమ‌ణి గురుద్వారా ప‌ర్బంధ‌క్ క‌మిటీ (ఎస్‌జీపీసీ) పంజాబ్‌తోపాటు, హ‌ర్యానా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌లో ఉండే అన్ని గురుద్వారాల‌ను పర్య‌వేక్షిస్తుంది. ఇదే క‌మిటీ అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్ బాధ్య‌త‌ల‌ను కూడా చూస్తుంది. అయితే ఈ క‌మిటీ ఇటీవ‌లే ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ర‌సాయ‌నాల‌కు దూరంగా అత్యంత స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో ధాన్యాలు, పండ్లు, కూర‌గాయ‌ల‌ను స్వ‌యంగా పండించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇలా పండిన ప‌దార్థాల‌తో ఆరోగ్య‌క‌రమైన భోజ‌నాన్ని సంద‌ర్శ‌కుల‌కు అందించాల‌ని సంక‌ల్పించింది. దీంతో అనుకున్న‌దే త‌డ‌వుగా గురుద్వారా గురుస‌ర్ స‌త్లానీ సాహిబ్‌, ప‌టియాలాల‌లో ఇప్ప‌టికే దాదాపు 40 ఎక‌రాల విస్తీర్ణంలో పూర్తి ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో కూర‌గాయ‌లు, పండ్ల‌ను ఎస్‌జీపీసీ పండిస్తోంది.
ఈ వ్య‌వ‌సాయ క్షేత్రాల్లో మొద‌టి ద‌శ‌లో భాగంగా క్యారెట్లు, క్యాబేజీ, పాల‌కూర‌, మెంతి ఆకుల‌ను పండిస్తున్నారు. దాదాపు 10 క్వింటాళ్ల‌కు పైగా ఆహార ప‌దార్థాల‌ను ప్ర‌తి 2 రోజుల‌కు ఒక‌సారి గోల్డెన్ టెంపుల్ గురుద్వారాకు పంపనున్నామ‌ని ఎస్‌జీపీసీ అధికారులు తెలియ‌జేశారు. కాగా పంజాబ్ ఆగ్రో ఇండ‌స్ట్రీస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (పీఏఐసీ) వారు ఎస్‌జీపీసీకి త‌మ వంతు స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తున్నారు. వ్య‌వ‌సాయ క్షేత్రాల్లో మ‌ట్టి ప‌రీక్ష‌లు చేయ‌డం, కృత్రిమ క్రిమి సంహార‌కాల‌కు బ‌దులుగా ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో ఎలా వ్య‌వ‌సాయం చేయాలి, స‌హ‌జ సిద్ధ‌మైన పురుగు మందుల‌ను ఎలా త‌యారు చేయాలి, వాడాలి అనే అంశాల ప‌ట్ల ఎస్‌జీపీసీ వారికి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పీఏఐసీ వారు వేప ఆకు, ఆవు మూత్రం వంటి స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో ఎరువుల‌ను త‌యారు చేయ‌డంపై కూడా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అయితే గోల్డెన్ టెంపుల్ క‌మిటీ వారు తాము పండించ‌డ‌మే కాదు  స్థానిక రైతుల‌ను కూడా ఆర్గానిక్ వ్య‌వ‌సాయం ప‌ట్ల ప్రోత్స‌హిస్తున్నారు.  ర‌సాయ‌నాల వాడ‌కాన్ని క్ర‌మంగా త‌గ్గించాల‌ని చెబుతూ రైతుల‌కు స‌హ‌జ సిద్ధ‌మైన ఆర్గానిక్ వ్య‌వ‌సాయం ప‌ట్ల అవ‌గాహ‌న పెంచుతున్నారు.
కాగా అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్ గురుద్వారా ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద వంట‌శాల‌గా ఇప్ప‌టికే రికార్డు సృష్టించింది. అక్క‌డ కుల‌, మ‌త‌, వ‌ర్గ‌, ప్రాంత భేదాలు లేకుండా నిత్యం ల‌క్ష మందికి పైగా సంద‌ర్శ‌కుల‌కు ఉచితంగా భోజ‌నం వడ్డిస్తున్నారు. ఇందుకోసం వారికి నిత్యం 7వేల కిలోల గోధుమ పిండి అవ‌స‌ర‌మవుతోంది. దీంతోవారు దాదాపు 2 ల‌క్ష‌ల‌కు పైగా చ‌పాతీలు చేస్తారు. అదేవిధంగా 1200 కిలోల బియ్యం, 1300 కిలోల ప‌ప్పుల‌తో ఆహార ప‌దార్థాల‌ను వండుతారు. ఇందు కోసం 450 మంది సిబ్బందితోపాటు స్వ‌చ్ఛందంగా ప‌లువురు వాలంటీర్లు కూడా సేవ‌లందిస్తుంటారు. కాగా గోల్డెన్ టెంపుల్‌లో స‌హ‌జ సిద్ధ‌మైన, ఆరోగ్య‌క‌ర భోజ‌నాన్ని అందించాల‌నే ఈ నిర్ణ‌యాన్ని దేశ‌వ్యాప్తంగా ఉన్న మిగ‌తా గురుద్వారాల‌లోనూ అనుస‌రించేలా ఎస్‌జీపీసీ అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. అదే అమ‌లైతే ఇక‌పై అన్ని గురుద్వారాల్లో స్వ‌చ్ఛ‌మైన ఆహారం దొరుకుతుంద‌న్న‌మాట‌!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top