చదివింది ఎం.కామ్ చేస్తున్నది ఫుడ్ డెలివరీ బాయ్ వైరల్‌ అవుతున్న న్యూస్ ..!!

నిరుద్యోగ సమస్య మన దేశాన్ని పట్టి పిడిస్తుంది. వందలు కాదు వేలు కాదు కొన్ని లక్షల మంది యువకులు ఉన్నత చదువులు చదివి చదువుకు తగ్గ జాబులు రాక ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే ఎంత జీతం ఇచ్చిన పర్లేదు అనుకోని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలం వెల్లదిస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మొన్న ఓ స్టార్ హోటల్లో సర్వీస్ బాయ్ కావాలని ఉద్యోగ ప్రకటన ఇచ్చారు. దీనికి కనీస విద్యార్హత 10 తరగతిగా పెట్టారు. ఈ జాబ్ కి డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకున్నారు.ఉన్న ఉద్యోగాలు వందల్లో అయితే అప్లై చేసింది లక్షల్లో దీనిని బట్టి చెప్పొచ్చు నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో.ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలా మంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. కొందరైతే ఏ పని చేసిన ఏంటి తమకు ఓ జాబ్ కావాలని చదువుకు, చేసే పనికి సంబంధం లేని ఉద్యోగాన్ని చేస్తున్నారు.

డిగ్రీలు, పీజీలు, ఎంబీఏ, ఎంసీఏ లు చేసినవారు కనీసం పదో తరగతి పాస్ కానీ వారు ఇద్దరు ఒకే ఉద్యోగం చేయడం, ఒకే హోదాలో ఉండటం మన దేశ నిరుద్యోగ పరిస్థితికి అద్దం పడుతుంది. తాజాగా ఇలాంటి సంఘటన కోల్‌కత్తాలో జరిగింది.

ఈ మధ్య జోమటో, స్విగ్గీ, ఉబర్, అంటూ ఆన్‌ లైన్‌ ఫుడ్‌ డెలవరీ సంస్థలు ఎక్కువ అయ్యాయి. వాటిలో డెలవరీ బాయ్‌గా భారీ సంఖ్యలో నిరుద్యోగులు పనిచేస్తున్నారు. ఎ డెలవరీ సంస్థలు ఇచ్చే అరకొర జీతాలతో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే డెలవరీ బాయ్స్‌గా కనీస విద్యార్థత పది అంటూ జొమాటో నిర్ణయించింది. కానీ పది పీజీ పూర్తి చేసిన వారు కూడా బయట వారి చదువుకు తగ్గ జాబ్ దొరకక డెలివరీ బాయ్స్ గా పని చేస్తున్నారు.

ఈమద్య జొమాటో ఫుడ్‌ డెలవరీ బాయ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతుంది. శౌవిక్‌ దత్తా అనే కస్టమర్‌ తాజాగా ఫుడ్‌ను ఆర్డర్‌ చేశాడు. తనకు ఫుడ్‌ ను తీసుకు వచ్చే వక్తి గురించి చూడాలనుకున్న శౌవిక్‌ దత్తా యాప్‌లో మిరాజ్‌ అనే యువకుడి వివరాలు చూసి అవాక్కయ్యాడు. కోల్కత్తకు చెందిన మిరాజ్‌ ఎంకాం చేయడంతో పాటు, ఫైనాన్స్‌లో డిప్లమా చేశాడు. ఇంత చదువు ఉన్నా కూడా ఏ ఉద్యోగం రాకపోవడంతో ఇలా డెలవరీ బాయ్‌గా చేస్తున్నాడు. మిరాజ్‌ గురించి సోషల్‌ మీడియాలో శౌవిక్ దత్త పోస్ట్‌ చేశాడు. ఆ విషయం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యింది. అది కాస్త కొన్ని సంస్థల దృష్టికి రావడంతో మిరాజ్‌కు జాబ్‌ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. దింతో డెలివరీ బాయ్ మిరాజ్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ కి ఎప్పటికి రుణపడి ఉంటానని చెప్తున్నాడు.

 

Comments

comments

Share this post

scroll to top