నీటిపై తేలియాడే #Post Office: దాని వింత‌లు-విశేషాలు.

మ‌న దేశంలోని పోస్ట‌ల్ వ్య‌వ‌స్థ ఎంత పెద్ద‌దో అంద‌రికీ తెలుసు. ఎన్ని ప్రైవేటు సంస్థ‌ల‌కు చెందిన కొరియ‌ర్స్ వ‌చ్చినా ఇప్ప‌టికీ పోస్టాఫీసుల ద్వారానే చాలా మంది ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు జ‌రుపుకుంటున్నారు. పార్సిల్స్ పంపుకుంటున్నారు. దీనికి తోడు బ్యాంకింగ్ సేవ‌లు కూడా పోస్టాఫీసుల్లో ల‌భిస్తున్నాయి. క‌నుక‌నే అవి ఇంకా ఆద‌ర‌ణ కోల్పోలేదు. అయితే మీకు తెలుసా..? పోస్టాఫీసుల విష‌యానికి వ‌స్తే మ‌న దేశంలోని జ‌మ్మూకాశ్మీర్‌లో ఉన్న శ్రీ‌న‌గ‌ర్ దాల్ స‌ర‌స్సులో నీటిపై ఓ పోస్టాఫీసు ఉంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అది ఎప్పుడూ నీటిపై తేలియాడుతూ ఉంటుంది. ఓ హౌస్ బోట్‌లో దాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అదేమిటంటే…

దాల్ స‌ర‌స్సులో ఉన్న ఆ నీటిపై తేలియాడే పోస్టాఫీస్ మ‌న దేశంలోనే కాదు, అస‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోని పోస్టాఫీసుల్లోనూ నీటిపై ఉన్న‌ది ఇదొక్క‌టే. అవును, క‌రెక్టే. ప్ర‌పంచంలో నీటిపై తేలియాడే పోస్టాఫీసుల్లో ఇదొక్క‌టే ఆ కోవ‌కు చెందుతుంది. ఎక్క‌డా ఇలాంటి పోస్టాఫీసులు లేవు. అయితే దీని గురించిన మ‌రో విష‌యం తెలుసా..? ఇందులో రెండు చిన్న‌పాటి రూమ్‌లు ఉంటాయి. ఒక‌దాన్ని పోస్టాఫీసు సిబ్బంది పోస్టాఫీసు, బ్యాంకింగ్ ప‌నుల కోసం వాడుతారు. వెనుక ఉన్న మ‌రో రూమ్‌లో ఫిలాటెలీ మ్యూజియం ఉంటుంది. ఇందులో పాత పోస్టు కార్డులు, స్టాంపులు ఉంటాయి.

ఇక ఈ తేలియాడే పోస్టాఫీస్ ఇప్ప‌టిది కాదు. బ్రిటిష్ వారి కాలం నుంచి అక్క‌డే ఉంది. 2011 వ‌ర‌కు దీన్ని నెహ్రూ పార్క్ పోస్ట్ ఆఫీస్ అని పిలిచేవారు. అయితే 2011లో దీని పేరును Floating Post Office గా మార్చారు. అప్ప‌టి నుంచి ఇదే పేరుతో దీన్ని వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ పోస్టాఫీసులో బ్యాంకింగ్ ప‌నులు కూడా కొన‌సాగుతాయి. ఇందులో చుట్టూ హౌస్ బోట్ల‌పై నివాసం ఉండే అనేక మంది ప్ర‌జ‌లు నెల నెలా డ‌బ్బులు దాచుకుంటారు. ఈ క్ర‌మంలో వారు దాచే డబ్బుల విలువ నెల‌కు రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. క‌నుక‌నే ఈ పోస్ట్ ఆఫీస్‌ను ఇంకా కొన‌సాగిస్తున్నారు. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ వారు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే పోస్ట్ కార్డుల‌పై ముద్ర వేస్తారు క‌దా, అది ఎలా ఉంటుందంటే… ఓ ప‌డ‌వ‌, తెడ్డు క‌లిపి ఉన్న సింబ‌ల్ ఉంటుంది. వారి స్టాంప్ అలా ఉంటుంది. దాన్నే పోస్ట్ కార్డుల‌పై వేస్తారు. ఈ పోస్ట్ ఆఫీస్ చుట్టూ హౌస్ బోట్ల‌పై ఉండేవారు మాత్ర‌మే కాకుండా చుట్టూ ప‌ని చేసేందుకు వ‌చ్చే కూలీలు కూడా ఇందులో డ‌బ్బులు పొదుపు చేస్తారు. ఏది ఏమైనా నీటిపై తేలియాడే ఈ పోస్ట్ ఆఫీస్ భ‌లేగా ఉంది క‌దా..!

 

Comments

comments

Share this post

scroll to top