కుక్క అనుకుని పట్టుకున్నారు… ఆ తర్వాత ఏమైందంటే.?

కుక్క, నక్క, తోడేలు ఈ మూడు చూడడానికి ఒకేలా ఉంటాయి. మాములుగా వీటిని చూసిన వారెవరైనా కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే కన్ఫ్యూజ్ అయ్యారు యూరప్‌లోని ఎస్టోనియాలో ఉన్న సింది డ్యామ్ దగ్గర పనిచేస్తున్న నిర్మాణ కూలీలు. అక్కడి సమీపంలోని పర్ను నది గడ్డ కట్టుకుపోయింది.

అయితే ఆ నదిలో చిక్కుకుని ఏడుస్తున్న ఒక జంతువును చూసారు ఆ కూలీలు. ముందుగా ఆ జంతువును కుక్క అనుకున్నారు. దాన్ని ఎలాగోలా కాపాడాలనుకుని నది మధ్యలోకి వెళ్లి మంచులో కూరుకుపోయిన ఆ జంతువును బయటకు తీసారు. బయటకు తీసాకా అర్ధమైంది అది కుక్క కాదు తోడేలు అని. మొదట కాస్త భయపడ్డా మంచులో కూరుకుపోవడంతో బాగా క్షీణించడంతో వాళ్లను ఏం చెయ్యలేకపోయింది.

దీంతో వారు తోడేలును షెల్టర్ కు పంపించాలని నిర్ణయించుకున్నారు. బయటకు తీసిన తోడేలును తమ దగ్గరున్న టవల్ తో తుడిచి కారులో దగ్గరలోని టెర్విక్స్ క్లీనిక్ కు తోడేలును తరలించారు. అక్కడి వైద్యులు ఆ జంతువుని తోడేలు అని నిర్ధారించి తగిన వైద్యం చేసారు. దాని ఆరోగ్యం కుదుటపడ్డాక జీపీఎస్ కాలర్‌ను దాని మెడకు జత చేసి దాన్ని అడవిలో వదిలేశారు. ఈ ఘటనను యానిమల్ షెల్టర్ సిబ్బంది తమ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. దీంతో ఆ స్టోరీ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Comments

comments

Share this post

scroll to top