ఈ వీడియోలో ఏముంది బాస్.. అయిదు రోజుల్లోనే రెండున్నర కోట్ల మంది చూసేశారు.!

అతని  పేరు కాబీ, వయస్సు 27,  US లో ఉంటాడు.  వీడియో బ్లాగింగ్ చేయడం వృత్తి గా ఎంచుకున్నాడు. అందులో   భాగంగానే ..ఫేస్ బుక్ లో  15 సంవత్సరాల పిల్లాడిగా ఓ ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేశాడు. ఇక ఆ ప్రాంతంలో ఉన్న 12 ,13, 14 సంవత్సరాల అమ్మాయిలకు   ఫ్రెండ్స్ రిక్వెస్ట్స్ పంపి, వారిని ఫ్రెండ్స్ చేసుకున్నాడు. కొన్ని రోజులు వాళ్లతో  చాలా డీప్ గా చాట్ చేశాడు. ఓ ఫైన్ డే  అతని ఫేక్ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న  ఆ  ముగ్గురు అమ్మాయిలను కలవాలని,  ఒక్కొక్కరికి.. ఫలానా టైం కి ఫలానా చోటుకి రమ్మని మెసేజ్  చేశాడు  కాబీ.

ఉదయం:

కాబీ ఫేక్ అకౌంట్ తో చాట్ చేసిన 12 సంవత్సరాల అమ్మాయి, మా ఇంట్లో వాళ్లు  మరో  10 నిమిషాల్లో వెళ్లిపోతారు అప్పుడు నేను బయలు దేరుతా అని చెప్పింది.. ఇంట్లో  పేరెంట్స్ వెళ్లగానే  ముందుగా  వారిద్దరూ  అనుకున్న పార్క్ దగ్గరకు వచ్చింది…  తన తో చాట్ చేసిన వ్యక్తి కోసం వెతుకుతుంది..ఇంతలో అక్కడ వాళ్ల నాన్న ప్రత్యక్షమయ్యాడు…

రాత్రి;

తనతో చాట్ చేసిన  13 యేళ్ల అమ్మాయిని తన దగ్గరకు రావాలని కోరాడు కాబీ. వెయిట్ మా డాడీ పడుకోగానే వచ్చేస్తా అని రిప్లే…  కాసేపయ్యాక కాబీ చెప్పిన అడ్రస్  దగ్గరికి  వచ్చేసింది ఆ 14 యేళ్ళ అమ్మాయి… తనతో చాట్ చేసిన వ్యక్తి కోసం వెతుకుతోంది … ఇంతలో ఇక్కడ కూడా ఆ అమ్మాయి నాన్న ప్రత్యక్షమయ్యాడు.

అదే రోజు అర్ధరాత్రి:

తనతో చాట్ చేస్తున్న 14 సంవత్సరాల అమ్మాయిని  కార్ లో అలా బయటికి వెళ్దాం రా.. అని అడిగాడు కాబీ . వెంటనే ఆ అమ్మాయి అతను చెప్పిన కార్ లో ఎక్కేసింది లోపల ఎవరున్నారో చూసుకోకుండా .. కార్ లోకి ఎక్కగానే ఆ అమ్మాయిని గట్టిగా లోపలికి లాగారు ..దాంతో ఆ అమ్మాయి తనను కిడ్నాప్ చేస్తున్నారు అనుకుంది. కట్ చేస్తే కార్ వెనుక సీట్లో ఉన్నది వాళ్ల అమ్మానాన్న.

 

 

అంటే ఈ మూడు సీన్ల లో కూడా వాళ్ల  పేరెంట్స్ ఎంటర్ అయ్యారు . అసలు విషయం ఏంటో తెలుసా.! .ఇదంతా ఆ వీడియో బ్లాగర్ అనుకునే చేశాడు..  ఆ పిల్లలను అలా రహస్య ప్రదేశాలకు పిలిచినప్పుడు ముందుగానే సమాచారాన్ని వాళ్ల తల్లీదండ్రులకు ఇచ్చాడు.పిల్లలతో చాటింగ్, రహస్య ప్రదేశాలకు రమ్మనడం మాత్రం రియలే…  సోషల్ మీడియా లో ముక్కు మొహం తెలియకుండా పరిచయమైన వాళ్లు రమ్మన్న  ప్రదేశానికి టీనేజ్ పిల్లలు ఎలా వెలుతున్నారో చెప్పడమే తన వీడియో ఉద్దేశ్యం అని చెప్పాడు కాబీ.. అలా వచ్చిన వారిని కిడ్నాప్ చేస్తే పరిస్థితి ఏంటి ?

7 లక్షల 50 వేల మంది హైజాక్ చేసే వాళ్లు ఈ ఫేస్ బుక్ లోనే ఉన్నారు సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెబుతున్నాడు కాబీ… మీరూ జాగ్రత్తగా ఉండండి..  మీ పిల్లలను సోషల్ మీడియా లో ఎలా ఉంటున్నారో ఓ కంట కనిపెడుతుండండి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top