71 ఏళ్ల కిందట మన దేశం నుంచి బ్రిటిష్‌ వారు దొంగిలించుకుపోయిన మొక్క జాతులు మళ్లీ మనకు దక్కనున్నాయి తెలుసా..?

మన దేశాన్ని పాలించిన బ్రిటిష్‌ వారు మన దగ్గర ఉన్న అనేక విలువైన వస్తువులను దొంగిలించుకుపోయిన సంగతి తెలిసిందే. అలాంటి వాటిలో అతి విలువైన కోహినూర్‌ వజ్రం కూడా ఉంది. అయితే నిజానికి ఇది మనకు తెలిసిన విషయం. కానీ తెలియకుండా ఇంకా అనేక వాటిని బ్రిటిష్‌ వారు దొంగిలించుకుపోయారు. వాటిల్లో మన దేశానికి చెందిన అతి ముఖ్యమైన మొక్కల జాతులు ఉన్నాయి. వాటిని మన దగ్గర నామ రూపాలు లేకుండా చేశారు. అనంతరం వాటి జాతులు కొన్నింటిని ఇక్కడ ఉండకుండా లండన్‌కు తరలించారు. అలా కొన్నేళ్ల పాటు అవి లండన్‌లోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్లీ మన సైంటిస్టులు వాటిని తిరిగి భారత్‌కు తేనున్నారు.

అవును, మీరు విన్నది నిజమే. లండన్‌ నాచురల్‌ హిస్టరీ మ్యూజియంలో భారతదేశానికి చెందిన పలు మొక్కలు, వృక్ష జాతులు ఉన్నాయి. వాటిని తిరిగి ఇప్పుడు మన సైంటిస్టులు భారత్‌కు తేనున్నారు. 71 ఏళ్ల తరువాత తిరిగి ఆ మొక్క జాతులు మనకు లభించనున్నాయి. ఇందుకు కారణం భారత్‌ కు, బ్రిటన్‌కు మధ్య జరిగిన ఒప్పందమే. ఆ ఒప్పందం ప్రకారం సదరు అరుదైన మొక్కలు మనకు మళ్లీ లభ్యం కానున్నాయి.

ఇప్పటికే బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (బీఎస్‌ఐ) సైంటిస్టులు సదరు మొక్కలను పరిశీలించే పనిలో పడ్డారు. దాదాపుగా 25వేల మొక్కల జాతులను వారు పరిశీలించారు. వాటి డిజిటల్‌ ఇమేజ్‌లను స్వీకరించారు. ఇక మరో 60 లక్షల జాతుల మొక్కలు మ్యూజియంలో అధ్యయనానికి మన సైంటిస్టులకు అందుబాటులో ఉన్నాయి. వాటిని వారు పరిశీలిస్తున్నారు. కాగా ఈ పరిశీలన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా..? వరి, గోధుమ, జొన్న తదితర ఆహార ధాన్యాల జాతులు కాకుండా కొత్త రకాలు ఏమైనా తెలుస్తాయా అన్నది వీరి అధ్యయనం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో మార్చి 15 వరకు అనేక జాతులను పరిశీలించి ఓ కన్‌క్లూషన్‌కు రావాలని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే వారు పరిశీలిస్తున్న మొక్కల్లో అనేక మొక్కలు కొన్ని వందల ఏళ్ల వయస్సువి కూడా ఉన్నాయి. 20 నుంచి 300 ఏళ్ల వయస్సున్న మొక్కలు, వృక్ష జాతులను సైంటిస్టులు పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా.. ఇదొక శుభ పరిణామంగా చెప్పవచ్చు. జనాలకు ఏవైనా కొత్త రకమైన ఆహార జాతికి చెందిన మొక్కలు దొరికితే ఇంక అంతకన్నా మించిన పెద్ద ప్రయోజనం మరొకటి ఉండదు కదా..!

The British Took These Wild Plants to London. Now They Are Coming Back!

Comments

comments

Share this post

scroll to top