జనవరి 1 వ తారీఖున ఆడపిల్ల పుడితే RS.5 లక్షలు.!!

న్యూ ఇయర్ కి మనం చాలా ఆఫర్స్ చూసి ఉంటాం, కానీ న్యూ ఇయర్ కి అమ్మాయి పుడితే 5 లక్షలు ఇస్తారు అనే ఆఫర్ గురుంచి ఎప్పుడైనా విన్నారా.? దేశ వ్యాప్తంగా ఈ పధకం అమలు లో లేదు, కర్ణాటక లోని ఒక ప్రాంతం లోనే ఈ పధకం అమలులో ఉంది. వివరాల్లోకెళితే బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) వారు… బెంగుళూరు లోని హాస్పిటల్స్ లో బీబీఎంపీ వారు దాదాపు 40 కి పైగా హాస్పిటల్స్ ను రన్ చేస్తున్నారు, ఆ హాస్పిటల్స్ లో జనవరి 1 2019 న జన్మించే ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయిలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నారు. బుధవారం బీబీఎంపీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మేయర్ గంగాంబికా గత ఏడాది నుంచి బీబీఎంపీ పింక్‌ బేబీ పేరుతో న్యూ ఇయర్‌ మొదటి రోజున జన్మించిన ఆడపిల్లలకు రూ.5 లక్షలు అందించే పథకం అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

బీబీఎంపీ హాస్పిటల్స్ లో ఆ రోజు జన్మించే అబ్బాయిలకు.

అమ్మాయి పుడితే 5 లక్షల రూపాయిలు అంటున్నారు, మరి అబ్బాయి పుడితే ఎంత ఇస్తారో అని అనుకుంటున్నారా.? రూపాయి కూడా ఇవ్వరు, అమ్మాయిల చదువులకు ప్రోత్సాహం ఇవ్వడం కోసమే ఈ పధకం ప్రవేశ పెట్టారు. బీబీఎంపీ హాస్పిటల్స్ లో జనవరి 2 వ తారీఖున జన్మించిన ఆడపిల్లలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని మేయర్ తెలిపారు.

ఇలాంటి పధకం దేశవ్యాప్తంగా రావాలి :

చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఇటువంటి పధకాలను ప్రవేశ పెట్టారు. అమ్మాయిల జననం ను ప్రోత్సహించే విధంగా గవర్నమెంట్ అడుగులు వేస్తుండటం చాలా హర్షించదగిన విషయం. ఏ ప్రభుత్వం వచ్చినా, ఆడపిల్లల జననం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించి వారసుడు వరుణుడు వసీకర్ అంటూ మాట్లాడే మాటలకు అడ్డుకట్ట వేసి, జనాల్ని చైతన్యపరచాలి. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా పెంచే పద్దతి, పెరిగే వాతావరం లో ఉంటుంది కానీ. అబ్బాయి అంటే వారసుడు అనుకోడం అమాయకత్వం అని ఇది వరకే చాలా మంది చెప్పారు.

 

 

Comments

comments

Share this post

scroll to top