బిగ్ బాస్ 2 సీజ‌న్ కు యాంక‌ర్‌గా హీరో నాని ఎంత రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నాడో తెలుసా

తెలుగులో వ‌చ్చిన బిగ్‌బాస్ షో అభిమానుల‌ను ఎంత‌గా అల‌రించిందో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్‌టీఆర్ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో షోకు మంచి పాపులారిటీ వ‌చ్చింది. అయితే గ‌తేడాది బిగ్ బాస్ తొలి సీజ‌న్ తెలుగులో ప్రారంభ‌మైనా ఇప్ప‌టి వ‌ర‌కు రెండో సీజ‌న్ గురించి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ త్వ‌ర‌లో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 2 ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. ఇక ఆ షోకు ప్ర‌ముఖ హీరో నాని యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం.

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 2 షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంద‌ని తెలిసింది. ఇందుకు గాను ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో ప్ర‌త్యేకంగా సెట్ వేశార‌ట‌. ఇక అందులో పాల్గొనే కంటెస్టెంట్ల‌కు దిమ్మ తిరిగేలా అధునాత‌న స‌దుపాయాల‌ను క‌ల్పించ‌నున్నార‌ట‌. అలాగే ఈ సీజ‌న్‌కు నాని యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని కూడా దాదాపుగా క‌న్‌ఫాం అయింది. అలాగే నానికి ఈ సీజ‌న్‌కు గాను స్టార్ మా యాజ‌మాన్యం రూ.4 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్‌ను అందిస్తుంద‌ని తెలిసింది.

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 2 షోకు నాని యాంక‌ర్‌గా వ‌స్తుండ‌డంతోపాటు అత‌ను ఈ సీజ‌న్‌కే రూ.4 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాండ‌నే వార్త ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఇక ఈ షోకు గాను మొత్తం 100 ఎపిసోడ్లు ఉండ‌నుండ‌గా, జూన్ లో షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. మ‌రి ఈ సారి పాల్గొనే సెల‌బ్రిటీలు ఎవ‌రో వేచి చూస్తే తెలుస్తుంది. అయితే ఇప్ప‌టికే ఈ షోలో పాల్గొనేందుకు సామాన్యుల‌కు కూడా స్టార్ మా అవ‌కాశం క‌ల్పించింది. అంటే.. సాధార‌ణ పౌరుల‌కు కూడా ఈ సారి బిగ్ బాస్ షోలో పాల్గొని సెల‌బ్రిటీ అయ్యే అవ‌కాశం ఉంద‌న్నమాట‌. ఇక షో ప్రారంభం అయ్యే వ‌ర‌కు అభిమానుల్లో ఉత్కంఠ మాత్రం త‌ప్ప‌దు క‌దా..!

 

 

Comments

comments

Share this post

scroll to top