2015 ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇదే…ఈ ప్రయాణం చాలా నేర్పింది. లవర్స్ మిస్ కావొద్దు !

ప్రయాణం మనకు ఎన్నో పాఠాల్ని గుణపాఠాల్ని నేర్పుతుంది. తెలుసుకున్న వారు ప్రేమ ఆప్యాయతలను పొందుతారు, తెలుసుకోలేని వారు బంధాలు, అనుబంధాలకు దూరమవుతారు. రామ్, సీత అందరిలాగే కాలేజ్ లో చదువుకున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం, ఆ ఇష్టం ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రాసెస్ లో, మిస్ అండస్టాండిగ్ కారణంగా తమ ప్రేమకు బ్రేకప్ చెప్పేస్తారు. కట్ చేస్తే పండుగకు ఊరు వెళ్తున్న రామ్ కి అనుకోకుండా తారసపడుతుంది సీత. మళ్ళీ ఇద్దరి మధ్యా మాటలు కలుస్తాయి. ఆ మాటల మధ్యలో పండుగకు సీతను తన ఊరికి రమ్మని పిలుస్తాడు రామ్. రామ్ తో పాటు ఊరెళ్లిన సీత రామ్ తల్లిదండ్రులతో బాగా కలిసిపోతుంది. చివరికి రామ్, సీత ఒకటయ్యారా? అసలెందుకు బ్రేకప్ అయ్యారనేది మిగతా స్టొరీ. ఈ ప్రయాణంలో ఆ ప్రేమ జంట నేర్చుకున్నదేమిటి అనేది చిత్ర కథాంశం.

“ప్రయాణం” ఈ షార్ట్ ఫిలింలో, అనురాగాలు, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు, ప్రేమ,త్యాగం, జీవితం అన్నిటినీ చాలా సింపుల్ వేలో చెప్పుకొచ్చాడు దర్శకుడు. “డెసిషన్ తీసుకున్నాక.. డిస్కషన్  వేస్ట్”, ” ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి పట్టినంత కాలం.. బ్రేకప్ చేసుకోటానికి పట్టట్లేదు” వంటి డైలాగులు బాగున్నాయి. ఇక మేకింగ్, విజువల్ పరంగా సుభాష్, ధీరజ్ ల డైరెక్షన్ చాలా రిచ్ గా ఉంది. కలర్ ఫుల్ ఫోటోగ్రఫీ, వినసొంపైన సంగీతం.. ముఖ్యంగా నేఫధ్య సంగీతం సినిమాకు మేజర్ హైలెట్. పేరుకు మాత్రమే షార్ట్ ఫిలిం అయినా ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూవర్స్ షార్ట్ ఫిలింలలో “ప్రయాణం” షార్ట్ ఫిలింను, ఇప్పటివరకూ యుట్యూబ్ లో కొన్ని లక్షలమంది వీక్షించి, అభినందించారు.  అందుకే ఈ షార్ట్ ఫిల్మ్ 2015 ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా నిలిచింది.
Watch Short Film: PRAYANAM:

Comments

comments

Share this post

scroll to top