ఆ బ్యూటీ క్వీన్ ఉదర భాగాన్ని తొలగించారు!

ఎవరైనా కళ్లు లేకుండా ఉంటారు లేదా కాళ్లు చేతులు లేకుండా జీవిస్తారు. కానీ అమెరికాకు చెందిన చెస్నీ మన్రో బెర్జీన్స్ అనే బ్యూటీ క్వీన్ మాత్రం తనకు ఉదర భాగం లేదని, వైద్యులు తొలగించారని తెలిపింది. ఇప్పుడు ఆమె ఉదరం (కడుపు) లేకుండానే జీవిస్తోంది.

23 ఏళ్ల వయస్సులో ఆమెకు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చింది. ఆమె కుటుంబంలో అంతా కూడా క్యాన్సర్‌ వ్యాధితో చనిపోవడంతో ఆమె ఆందోళనకు గురైంది. అప్పటికే మన్రోకి క్యాన్సర్ ముదరడంతో కిమోథెరఫీ, రేడియేషన్‌లతో ట్రీట్మెంట్ చేయడం సాధ్యం కాదని వైద్యులు చెప్పేశారు. దీంతో క్యాన్సర్ సోకిన ఉదర భాగాన్ని మొత్తం తొలగించారు. శరీరానికి తగిన పోషకాలు అందకపోవడంతో రెండుసార్లు చావును చూసి వచ్చానంది.

ఉదర భాగాన్ని తొలగించడం వల్ల ఆమె ఏ ఆహారం తీసుకున్నా కష్టంగా ఉండేది. చాలా తక్కువగా ఆహారాన్ని తీసుకోవాల్సి వచ్చేది. ఆహారం జీర్ణమయ్యే అవకాశాలు తగ్గిపోవడంతో బాగా నమిలి తినాల్సి వచ్చేది. ఉదర భాగం లేకుండా ఆమె జీవిస్తోందని తెలిసి చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. తీసుకునే డైట్, ఎక్సెర్సైజ్ కారణంగా ఇప్పుడు మన్రో మాములు మనిషి అయ్యింది. మరో వైపు ఆమె కుటుంబం నుంచి సంక్రమించిన రొమ్ము క్యాన్సర్ కు కూడా ఆమె చికిత్స చేయించుకుంది.

తాను ఈ రోజు జీవించి ఉండడానికి కారణం తన భర్తేనంటోంది మన్రో. మూడేళ్ల పాటు నరకయాతన అనుభవించిన మన్రో 2018లో మిసెస్ టెక్సాస్ గా ఎంపికైంది. ఆ తర్వాత మిసెస్ అమెరికా పోటిలో ఆరో స్ధానంలో నిలిచింది. మనలో ఎన్నో వైఫల్యాలు ఉన్నా…. దాని గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుని పోతే ఏదైనా సాధించవచ్చు అని తోటి మహిళలకు మన్రో స్ఫూర్తిగా నిలుస్తోంది.

Comments

comments

Share this post

scroll to top