కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి షోలో ఇచ్చేది డ‌మ్మీ చెక్కు అట తెలుసా..? ఆ షోకు చెందిన మ‌రికొన్ని సీక్రెట్స్ ఇవే..!

కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి. ఈ గేమ్ పేరు తెలియ‌ని వారుండరు. మొద‌ట కొన్ని గేమ్స్‌ను అమితాబ్ బ‌చ్చ‌న్ చేయ‌గా, కొన్ని గేమ్స్‌కు షారుక్ ఖాన్ హాజ‌రు అయ్యాడు. అయితే తెలుగులోనూ మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు పేరిట గేమ్ పెట్టారు. దీనికి మొద‌ట్లో నాగార్జున హోస్ట్‌గా వ‌చ్చారు. త‌రువాత మెగాస్టార్ చిరంజీవి వ‌చ్చారు. అయితే ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే… ఈ షోలో మ‌నం హోస్ట్ రావ‌డం, ఫాస్టెస్ట్ ఫింగ‌ర్ రౌండ్‌, ఆ త‌రువాత కంటెస్టెంట్‌ల‌ను పిల‌వ‌డం, వారితో గేమ్ ఆడ‌డం, మ‌ధ్య మ‌ధ్యలో జోకులు వేయ‌డం, గేమ్‌లో గెలిచిన వారికి ప్రైజ్ మ‌నీ చెక్కులు ఇవ్వ‌డం చూస్తాం. అయితే అస‌లు ఈ గేమ్ వెనుక బ్యాక్‌స్టేజ్‌లో ఏం జ‌రుగుతుందో తెలుసా..? ముఖ్యంగా ఈ గేమ్ హిందీ వెర్ష‌న్ అయిన కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి బ్యాక్ స్టేజ్‌లో ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి బ్యాక్ స్టేజ్ విష‌యాలు, సీక్రెట్ల‌ను గురించి సోష‌ల్ మీడియాలో ఓ వ్య‌క్తి పోస్టు పెట్టాడు. అందులోని విష‌యాల‌నే ఇప్పుడు మీకు చెప్ప‌బోతున్నాం.

 • కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తిలో వ్యాఖ్యాత అయిన బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ టీవీలో క‌న్నా రియ‌ల్ గానే ఎక్కువ‌ స్మార్ట్‌గా క‌నిపిస్తార‌ట‌.
 • టైం అంటే టైమే. అందుకు అమితాబ్ అంత‌టి స్టార్ అయ్యారు. ఆయ‌న ఈ గేమ్ జ‌రిగే సెట్స్‌కు ఏ టైం చెబితే ఆ టైముకు కొంచెం అటు ఇటు కూడా కాకుండా క‌రెక్ట్‌గా వ‌స్తార‌ట‌. అంత‌టి టైం సెన్స్ పాటిస్తారు అమితాబ్‌.
 • కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి షోలో అమితాబ్ ధ‌రించే దుస్తుల విలువ రూ.10 ల‌క్ష‌ల‌కు పైగానే ఉంటుందట‌. ప్ర‌ముఖ డిజైన‌ర్లు స్వ‌యంగా కుట్టిన దుస్తుల‌ను అమితాబ్‌కు కాస్ట్యూమ్స్‌లా వాడుతార‌ట‌.
 • అప్ప‌ట్లో… అంటే 2012కు ముందు ఈ షో గోరెగావ్‌లోని ఫిలిం సిటీలో తీశారు. ఆ త‌రువాత షో సెట్‌ను వైఆర్ఎఫ్ స్టూడియోకు మార్చారు.
 • తార‌క్ మెహ‌తా కా ఉల్టా చ‌ష్మా అన‌బ‌డే ప్ర‌ముఖ హిందీ సీరియ‌ల్ సెట్ కేబీసీ సెట్‌కు ద‌గ్గ‌ర్లోనే ఉంటుంది. బ‌య‌టి నుంచి చూస్తే అది క‌నిపిస్తుంది.
 • కేబీసీ (కౌన్ బ‌నేగా క‌రోడ్ పతి) సెట్‌కు రాగానే అమితాబ్‌ను ఆయ‌న కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన చాంబ‌ర్‌కు తీసుకెళ్తారు. అక్క‌డే కంటెస్టెంట్ల‌కు చెందిన విష‌యాల‌ను ఆయ‌న‌కు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అందుకోసం ఆయ‌న‌కు ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు.
 • ప్ర‌తి కంటెస్టెంట్‌తో ఎలా మాట్లాడాలి అనే విష‌యాల‌పై ముందే స్క్రిప్ట్ రాసి ఉంచుతారు. బిగ్ బి అమితాబ్ దాన్ని ఫాలో అయిపోతారు. అదే స‌మ‌యంలో కంటెస్టెంట్లు కూడా డ్రెస్‌లు వేసుకుని షోకు రెడీ అవుతారు.
 • అమితాబ్ చాంబ‌ర్‌కు ద‌గ్గ‌ర్లోనే మ‌రో చాంబ‌ర్ ఉంటుంది. అందులో అప్పుడే షో నుంచి త‌ప్పుకున్న/గెలిచిన/ఓడిన కంటెస్టెంట్ వేచి ఉంటాడు. షో పూర్త‌య్యే వ‌ర‌కు కంటెస్టెంట్ అక్క‌డే వేచి ఉండాలి. అదే చాంబర్‌లో మ‌రో చోట సోనీ చాన‌ల్‌కు చెందిన సిబ్బంది ఉంటారు. వారు షో జ‌రుగుతున్న తీరును ఎప్ప‌టిక‌ప్పుడు సునిశితంగా ప‌రిశీలిస్తారు. పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా చూసుకుంటారు.
 • సోనీ చాన‌ల్ సిబ్బంది ప‌క్క‌నే అదే చాంబ‌ర్‌లో ఓ వ్య‌క్తి మాక్‌బుక్‌తో ఉంటాడు. అత‌నే సెట్‌లో కూర్చున్న అమితాబ్‌, ఆయ‌న ఎదురుగా ఉన్న కంటెస్టెంట్ టీవీ తెర‌ల‌పై ప్ర‌శ్న‌ల‌ను రియ‌ల్ టైంలో డిస్‌ప్లే చేస్తాడు. అత‌ని ప‌క్క‌న సంద‌డిగా చాలా మంది ఉంటారు. అయినా అవేవీ అత‌ను ప‌ట్టించుకోడు. ప్ర‌శ్న‌ల‌ను డిస్‌ప్లే చేయ‌డం అత‌ని డ్యూటీ.
 • సెట్‌లో పిచ్చుక‌ల స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. అవి మాటి మాటికీ వ‌చ్చి ఇబ్బంది పెడ‌తాయి. వాటి వాయిస్‌లు రికార్డ్ అవ‌కుండా సిబ్బంది చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు త‌రిమేందుకు సిబ్బంది ఉంటారు.
 • సెట్‌లో బిగ్ బి అమితాబ్ ప్ర‌శ్న‌ల‌ను వేస్తారు. కంటెస్టెంట్‌లు స‌మాధానాలు చెబుతారు. మ‌ధ్య మ‌ధ్య‌లో జోక్స్‌. కొంత రిలాక్సేష‌న్ ఉంటుంది. ఇలా ఒక్కో ఎపిసోడ్ షూటింగ్‌ 2, 3 రోజుల వ‌ర‌కు న‌డుస్తుంది. సాధార‌ణంగా షూటింగ్ రోజూ ఉదయం 7కు మొద‌లవుతుంది. రాత్రి 9 గంట‌ల‌కు ముగుస్తుంది.
 • ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు సెట్ లో అంద‌రికీ 3 పూట‌లా భోజ‌నం పెడ‌తారు. అంద‌రూ ఉచితంగా తిన‌వ‌చ్చు.
 • షోలో బిగ్ బి అమితాబ్ వ‌చ్చే దారి నిజానికి మెయిన్ దారి కాదు, కానీ షోలో అలా చూపిస్తారు. నిజానికి అది స్టేజీ బ్యాక్ గ్రౌండ్‌. అక్క‌డే వ‌చ్చిపోయేందుకు వీలుగా మెట్లు ఉంటాయి.
 • ఎపిసోడ్ పూర్త‌వ‌గానే కంటెస్టెంట్‌తోపాటు వచ్చిన వారు కూడా అమితాబ్‌తో ఫొటోలు దిగ‌వ‌చ్చు. ఆయ‌న్నుంచి ఆటోగ్రాఫ్‌లు తీసుకోవ‌చ్చు. గిఫ్ట్‌లు ఇవ్వ‌వ‌చ్చు. ఎన్ని పేప‌ర్లు ఇచ్చినా బిగ్ బి అమితాబ్ ఆటోగ్రాఫ్ లు పెడుతూనే ఉంటారు, త‌ప్ప విసుక్కోరు. అందుకే ఆయ‌న అంత పెద్ద స్టార్ అయ్యారు.
 • షోలో గెలిచిన వారికి వారు గెలుచుకున్న మొత్తం డ‌బ్బును వారి బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారు. అందుకు గాను కొంత స‌మ‌యం ప‌డుతుంది. అయితే ఆందోళ‌న అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఆ ప్ర‌క్రియ గురించి షో వారు ఎప్ప‌టిక‌ప్పుడు ఇంటిమేట్ చేస్తారు. ఇక షో గురించిన టీఆర్‌పీ రేటింగ్స్‌ను కూడా వారు కంటెస్టెంట్‌ల‌కు చెబుతారు.
 • షోలో డ‌బ్బులు గెలుచుకున్న కంటెస్టెంట్ల‌కు ఇచ్చేది డ‌మ్మీ చెక్కు మాత్ర‌మే. అస‌లు చెక్కు వేరేది ఉంటుంది. కొంద‌రికి డైరెక్ట్‌గా అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారు.

Comments

comments

Share this post

scroll to top