పదేళ్ళ కుర్రాడు..తను వేసుకున్న రెడ్ టీషర్ట్ ఊపుకుంటూ రైలుకు ఎదురుగా వెళ్ళాడు..850 మందిని కాపాడాడు.

అతని పేరు సిద్దేష్…వయస్సు 10.. రోజూలాగే  టీస్టాల్  నడిపే తన తండ్రికి సహాయం చేసేందుకు  రైల్వే ట్రాక్ దాటుకుంటూ వెళుతున్నాడు. అలా వెళుతున్న సమయంలో రైలు  పట్టాలు ఊడిన దృశ్యాన్ని గమనించి వెంటనే తన తండ్రికి చెప్పాడు. సిద్దేశ్ తండ్రి, ఆ ఊరి ప్రజలు ఆ ట్రాక్  దగ్గరికి వచ్చి చూస్తుండగానే  అదే ట్రాక్ పై భారీ శబ్దం చేసుకుంటూ హరిహర- చిత్రాగద ప్యాసింజర్ రైలు దూసుకొస్తోంది.  ప్రమాదం ముంచుకు వస్తోందని గమనించిన ఊరి ప్రజల్లో ఒక వ్యక్తి ఎవరి దగ్గరైనా ఎర్రటి వస్త్రం ఉంటే ఈ ప్రమాదాన్ని ఆపవచ్చు అని అన్నాడు. ఆ మాటలు విన్న సిద్దేశ్ ట్రైన్ కి ఎదురుగా పరుగెత్తాడు.

సిద్దేశ్ ఎరుపు రంగులో ఉన్న టీ-షర్ట్ ను ధరించి ఉన్నాడు . వెంటనే ఆ టీ-షర్ట్ ను ఒంటిపై నుండి తీసి, ఊపుకుంటూ  రైలు ఎదురుగా పరుగుతీశాడు. సిద్దేశ్ వెంటనే అతని తండ్రి, ఊరి ప్రజలు పరుగుతీశారు. ఇది గమనించిన లోకోపైలట్ వెంటనే బ్రేక్ వేసి, రైలును ఆపాడు. అప్పటికి ఆ రైలులో 850 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. జరిగిన విషయం తెలిసి అందరూ సిద్దేష్ కు మా ప్రాణాలు కాపాడడానికి దేవుడు పంపిన ధూతవు రా నువ్వు అంటూ  దండం పెట్టారు.

9-year-old-siddesh-averts-rail-accident-near--L-hNrrbi

ఈ సాహసం కారణంగానే సిద్దేష్ కు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం   చిల్డ్రన్స్ డే నాడు ధైర్యశాలి అవార్డ్ ఇచ్చింది.  అవార్డు అందుకున్న సమయంలో  సిద్దేశ్ చెప్పిన మాటలు  వింటే నిజంగా చప్పట్లు కొట్టకుండా ఉండలేం… 10యేళ్ళు కూడా నిండని ఈ కుర్రాడు ఏమన్నాడో తెలుసా..?  ” ప్రమాదాన్ని ఎలాగైనా ఆపాలనుకున్న , ప్రయాణికుల్ని కాపాడాలనే నా మనసుల గట్టిగా అనుకున్నా  అందుకే ఆ సమయంలో  ఎటువంటి భయం కలగలేదు.” అని అన్నాడు.

Comments

comments

Share this post

scroll to top