1$ కే అతను విమానం ఎక్కిస్తాడు.!? అందరి ఆశ తీర్చాలని ఏకంగా ఊరికే విమానాన్నితెచ్చాడు.

అతడి పేరు బహదూర్ చందన్ గుప్తా (58). 1980 నుండి  ఎయిర్ క్రాఫ్ట్ ఇంజినీర్ గా సేవలందించి రిటైర్ అయిన బహదూర్ హర్యానాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఒకరోజు ఆ ఊరిలోని ఒక అతను విమానం ఎక్కాలని ఆశగా ఉందని తనతో చెప్పాడు. అతని మాటలు గుప్తా మీద గట్టిగా పనిచేశాయ్… నిజమే  విమానంలో ప్రయాణించడమంటే డబ్బున్న వాళ్ళకే సాధ్యం,సామాన్యులకు విమానాన్ని దగ్గరి నుండి చూసి కూడా ఎరుగరు… అందుకే… గుప్తా సరికొత్త ఐడియాకు తెరతీసాడు.

విమానంలా ఉండే ఓ విమానాన్ని రూపొందించాడు. రియల్ విమానంలా ఇది ఆకాశంలో విహరించకున్నా, అచ్చు గాలిలో ప్రయాణిస్తున్నామనే ఫీల్ ను ప్రయాణికులకు కలిగిస్తాడు.  దీన్ని నిర్మించడానికి ఆయనకు అయిన ఖర్చు £60,000.. ఆ విమానం పేరు ఎయిర్ బస్ 300. ఇక ఈ విమానంలో ప్రయాణించడానికి అయ్యే ఖర్చు ఒకే ఒక్క $1మాత్రమే. ఇది ఏదో సినిమా విమానంలా  ఉందే అని తక్కువ ఆలోచనవద్దు.

రియల్ ఎయిర్ బస్ లో లానే ఇందులో బ్రీత్ ఎయిర్,సేఫ్టీ బెల్ట్ .. ఇలా అన్ని ఉపయోగిస్తారు. చిన్న పెద్ద అనే తేడాలేకుండా అందరూ ఈ ఎయిర్ బస్ లో ప్రయాణిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, బహుదూర్ ఆలోచనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఎయిర్ బస్ పై మీరూ ఓ లుక్కెయ్యండి.

Watch Video: 

Comments

comments

Share this post

scroll to top