పెరుగుతున్న ప్రెగ్నెన్సీ టూరిజం.. అక్కడకు క్యూ కడుతున్న మహిళలు!!

భారతదేశం ఎన్నో అందాలకు నెలవు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఎన్నో అందాలు దేశీయులనే కాకుండా విదేశీయులను సైతం కట్టిపడేస్తాయి. దేవాలయాలు సందర్శించడానికి కొందరు, మంచు కొండల అందాలను వీక్షించడానికి మరికొందరు, సముద్ర తీరాలలో సేద తీరడానికి ఇంకొందరు .ఇలా భారత్ కు ఎంతోమంది విదేశీ అతిథులు వస్తుంటారు… తనివితీరా ఆనందిస్తుంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొంత మంది విదేశీ యువతులు కేవలం గర్భం దాల్చడం కోసం ఇండియాలో ఒక ప్రాంతానికి వస్తుంటారు. అక్కడ నివసించే స్థానిక పురుషులతో జతకట్టి గర్భం దాల్చి తమ దేశానికి తిరిగివెళుతుంటారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నూటికి నూరుపాళ్ల నిజం. ఈ విధంగా చేయటానికి వారు ఒక పేరు కూడా పెట్టుకున్నారు అదే ప్రెగ్నెన్సీ టూరిజం . హిస్టారికల్ టూరిజం, వెదర్ టూరిజం , హెల్త్ టూరిజం, కేసినో టూరిజం ఇలా ఎన్నోరకాల టూరిజల గురించి మనకు తెలుసు కానీ ఇప్పుడు కొత్తగా వీటి సరసన ప్రెగ్నెన్సీ టూరిజం చేరడం విశేషం.

భారతదేశానికి పెట్టనికోట హిమాలయాలు. పాలమీగడ లాంటి మంచు అందాలు ఎంతో మంది విదేశీ అతిథులు ఇండియాను దర్శించడానికి కారణమయ్యాయి. కాశ్మీర్ లోయ సోయగాలు ఎంతోమంది పర్యాటకులను మంత్రముగ్ధులను చేసాయి. ఉగ్రవాదం నేపథ్యంలో ఇప్పడు యాత్రికుల సంఖ్య తగ్గినా హిమాలయాలను సందర్శించాలనుకునే టూరిస్టులు కోకొల్లలు. కానీ ఇప్పుడు మరోరూపంలో ఇక్కడికి టూరిస్టుల రాక పెరిగింది. అదే ప్రెగ్నెన్సీ టూరిజం . కేవలం గర్భం దాల్చడానకి విదేశీ యువతులు ఇక్కడికి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారనడంలో అతిశయోక్తిలేదు. హిమాలయాలలోని కొన్ని ప్రాంతాలు టూరిజం పరంగానే కాకుండా మరో విధంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎక్కడెక్కడినుండో కొంతమంది మహిళలు ఇప్పుడు హిమాలయ ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా హిమాలయాలలోని లడ్డాఖ్ పరిసర ప్రాంతాలకు ఎక్కువుగా విచ్చేస్తున్నారు. వీరు హిమాలయ ప్రాంతాలను వెతుక్కుంటూ వచ్చేది హిమాలయాల సోయగాలను వీక్షించడానికి కాదు… గర్భవతులు కావడానకి , నిజం మీరు విన్నది ముమ్మాటికి నిజం.

హిమాలయాలలోని లద్దాఖ్ పరిసర ప్రాంతాలలోని బ్రోక్పా అనే తెగ వారు జీవనం సాగిస్తున్నారు. వీరు మాత్రమే స్వచ్ఛమైన ఆర్యులని విదేశీయ మహిళల నమ్మకం . ఈ కారణంగానే చాలా మంది విదేశీ వనితలు ఈ ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ నివసించే బ్రోక్పా తెగ పురుషలతో సంభోగం జరిపి గర్భందాల్చాలని ఆశపడుతుంటారు. స్వచ్ఛమైన ఆర్యులతో కలవడం ద్వారా వారు కూడా స్వచ్ఛమైన ఆర్యులకు జన్మనివ్వాలని ఆశపడుతుంటారు. దానికోసమే ప్రత్యేకించి ఈ ప్రాంతానికి విచ్చేస్తుంటారు. సంజీవ్ శివన్ 2007 లో తీసిన ”ది ఆచ్టంగ్ బేబీ…ఇన్ సెర్చ్ ఆఫ్ ప్యూరిటీ” అనే డాక్యుమెంటరీ దీనికి నిదర్శనం.
జర్మనీ దేశస్థురాలు లడ్డఖ్ ప్రాంతానికి గర్భం దాల్చాలనే ఉద్దేశ్యంతో వచ్చినట్లు తదుపరి ఇక్కడి వ్యక్తి సాయంతో తన కోరిక నెరవేర్చుకున్నట్లు ఈ డాక్యుమెంటరీలో చూపించడంతో ఈ విషయం మరింత వెలుగులోకి వచ్చింది. ఈ ఆర్యులు ఎత్తుకు తగ్గ లావుతో బలంగా ఆరోగ్యంగా ఉండటంతో వీరినుండి సంతానం పొంది ..ఆర్యులు లాంటివారికి జన్మనివ్వాలని కొంతమంది విదేశీవనితల ఆశ. ఈ కారణంతోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రెగ్నెన్సీ టూరిజం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది.

Comments

comments

Share this post

scroll to top