ఆ రోజు అన్నయ్యఈ రోజ్ తమ్ముడురేపు ఎవరో?…వైఎస్ కుటుంబ విషాధ గాధ!!

రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ కుటుంబానిది చెరగని ముద్ర. వైఎస్ అనే పేరు వినగానే మొదట గుర్తొచ్చేది దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయనను దేవుడిలా భావిస్తారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నాడని. కానీ వైఎస్ కుటుంబానికి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మృత్యువు వెంటాడుతూనే ఉంది. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజా రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఆ తరువాత వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. ఇప్పుడు వైఎస్ సోదరుడు వివేకా దారుణ హత్యకు గురయ్యాడు. ఇలా న‌మ్మ‌లేని నిజాలు ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేస్తున్నాయి.

ప్ర‌జ‌ల హితం కోరేవాడు జననేత అవుతాడు. మహానేతగా నీరాజనాలు అందుకుంటాడు. జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు. అలాంటి నాయకుడే వైఎస్‌ రాజశేఖర రెడ్డి. జనం గుండెల్లో ఆయనది చెరగని స్థానం. రాజన్న అంటే ఒక ఆత్మీయ పలకరింపు. అంతకుమించి ఓ పెద్ద దిక్కు. అలాంటి మహానేత అభిమానులు, పార్టీ కార్యకర్తలను తీరని శోకంలో ముంచుతూ తిరిగిరాని లోకాలకు తరలిపోయారు (సెప్టెంబర్ 2-2009)న ఆయ‌న మ‌ర‌ణం కోలుకోలేని విషాదం ఆంధ్రాలో జ‌నాల‌ని శోక‌సంద్రంలో మునిగిపోయేలా చేసింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు వినగానే పేదల పాలిట ఓ దేవుడు కనిపిస్తాడు. బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి సొంత ఇంటి కలను సాకారం చేశాడు. చాలి చాలని పింఛన్లతో అల్లాడుతున్న వృద్దులకు, వితంతులకు, వికలాంగులకు, నేనున్నానంటూ 200 రూపాయల పింఛన్ సహాయం చేశాడు. పేదల ఆకలి తీర్చడానికి 2 రూపాయలకు కిలో బియ్యం అందించాడు. పేద విద్యార్థి కుసుమాల కోసం స్కాలర్షిప్, ఫీజు రేయంబర్స్మెంట్ తో వారి ఉన్నత చదువులకు ప్రోత్సహించాడు. ముఖ్యoగా ఆరోగ్యశ్రీ పేరుతో పేదల పాలిట దేవుడై వర్ధిల్లినాడు రాజశేఖరుడు. పేదలకు ఏమైనా పెద్ద రోగం వస్తే ప్రాణాలు వదిలేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ నేనున్నానంటూ పునర్జన్మ అందించాడు పేదలకు. ఆయన మేలు పొందిన నిరుపేదలైతే ఆ ఆత్మీయ నేతను నిత్యం దేవుడిలా కొలుస్తారు. వ్యవసాయం దండగ అని రైతులు ప్రాణాలు కొల్పుతున్న సమయంలో జలయజ్ఞం పేరిట రైతు పక్షపాతిగా మారాడు. ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆదుకుని రాజకీయాల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

కానీ కాలం ప్రియతమ నేతని ఎక్కువ రోజులు ప్రజలతో ఉండనివ్వలేదు. అందరూ దేవుడు దేవుడు అని కొలుస్తున్న సమయంలో నిజంగా దేవుడి దగ్గరికే వెళ్ళిపోయాడు ఆ దేవుడు. అది 2009 సెప్టెంబర్ 2 అప్పుడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దట్టమైన క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రచ్చబండ’ కార్యక్రమం ద్వారా ప్రజల బాధలు తెలుసుకుంటున్నారు వైఎస్. అయితే ఆ రోజు వాతావరణం అనుకూలంగా లేదని రచ్చబండ వాయిదా వేసుకోవాలని అధికారులు వారిస్తున్నా.. ప్రజలు నా కోసం ఎదురు చూస్తున్నారంటూ..చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్‌లో బయలుదేరారు రాజశేఖర్ రెడ్డి. ఆ తరువాత ఉదయం 9.35 గంటలకు హెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయాయి. యావత్తు దేశమంతటా ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం గాలింపు మొదలైంది. గంటలు గడుస్తున్నకొద్దీ తెలుగోడి గుండె కొట్టుకోవడం ఆగిపోతోంది. 12 గంటల తర్వాత ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అధికారులు చెప్పారు. ఒక రోజు తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. ప్రమాదస్థలం రుద్రకొండ కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు సమీపంలోని నల్లమల అడవుల్లో హెలికాప్టర్ పడి ఉంది. ఆనాడు ప్రమాదంలో వైఎస్‌తో పాటు మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వైఎస్ అలా చనిపోతే ఆయన సోదరుడు వివేకా కూడా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.

వైయ‌స్ వివేకా మొదట గుండెపోటుతో మరణించాడని వార్తలు వచ్చాయి. ఆ తరువాత గుండె పోటు కాదని ఎవరో హత్య చేశారని చెప్పారు. ఏపీలో ఎన్నిక‌ల వేళ ఆయ‌న మ‌ర‌ణం వైసీపీ కి షాక్ కు గురిచేసింది.వైఎస్ వివేకాకు ఒక కుమార్తె ఉంది. వైఎస్ మరణానంతరం ఏర్పడిన కిరణ్ కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. పులివెందులకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆయన వదిన విజయమ్మ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం విభేదాలకు స్వస్తి పలికి కుటుంబానికి దగ్గరయ్యారు వివేకా. ఆ తరువాత తన అన్న కొడుకు జగన్ స్థాపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ తరపున ఆయన పులివెందులలో ప్రచారం కూడా చేశారు. ఆయన మరణంతో జగన్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. వైయ‌స్ఆర్ ప్రజల దగ్గరికి వెళ్తూ ఆనాడు దూరమయితే. ఇప్పుడు వివేకా కూడా ఎన్నికల సమయంలో మరణించడం వైఎస్ కుటుంబానికి తిరనిలోటు.

 

 

Comments

comments

Share this post

scroll to top