లక్ష రూపాయలు చలానా విధించిన లైట్ తీసుకున్నాడు ఆ BMW కార్ ఓనర్…చివరికి ట్విస్ట్ ఏంటంటే.?

ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే ఎవ‌రైనా వెళ్లాల్సి ఉంటుంది. రూల్స్ త‌ప్పి ప్ర‌వ‌ర్తిస్తే ఎవ‌రిపైనైనా జ‌రిమానా వేస్తార‌న్న విష‌యం తెలిసిందే. అందుకు ఎవ‌రూ అతీతులు కాదు. ఈ క్ర‌మంలోనే ఉల్లంఘించిన రూల్‌ను బ‌ట్టి వాహ‌న‌దారుల‌కు ఫైన్ ఎక్కువ‌, త‌క్కువ ప‌డుతూ ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్‌, ఓవ‌ర్ స్పీడ్ వెళ్ల‌డం, సీట్ బెల్ట్/హెల్మెట్ పెట్టుకోక‌పోవ‌డం, సిగ్న‌ల్ జంపింగ్‌… అనేక ర‌కాల ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌కు వివిధ ర‌కాల ఫైన్స్ ప‌డ‌తాయి. కానీ ఎంత ఫైన్ ప‌డినా.. అలాంటి జ‌రిమానాలు ప‌డుతుంటే.. ఎవ‌రైనా ఇక‌పై అలా ఫైన్ ప‌డ‌కుండా ఉండేందుకు ట్రాఫిక్ రూల్స్‌ను అనుస‌రించి వాహ‌నాల‌ను న‌డిపిస్తారు. కానీ ఆ కారు ఓన‌ర్ మాత్రం అలా కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌నికి 70 ట్రాఫిక్ చ‌లాన్లు ప‌డ్డాయి. అయినా అత‌ను ఎప్ప‌టికప్పుడు ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించే వెళ్తుంటాడు. అయితే చివ‌ర‌కు పోలీసులు తీసుకున్న ఆ నిర్ణయంతో షాక్ తిన్న అత‌ను ఏకంగా పెండింగ్ లో ఉన్న చ‌లానాల‌ను మొత్తం క‌ట్టేశాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

ఆ కారు నంబ‌ర్ AP 28 DX 6363. చ‌క్ర‌ధ‌ర్ అనే వ్య‌క్తి పేరుపై ఆ కారు ఉంది. అయితే ఈ కారులో నిజంగా అత‌నే వెళ్తాడో, అత‌ని సంబంధీకులు వెళ్తారో తెలియ‌దు కానీ… ఈ కారు న‌డిపే వారు చాలా ర్యాష్‌గా న‌డుపుతారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ కార్‌కు ఓవ‌ర్ స్పీడింగ్‌, సిగ్న‌ల్ జంపింగ్ వంటి అనేక ట్రాఫిక్ చ‌లాన్లు ప‌డుతుంటాయి. అయినా ఆ కారును న‌డిపేవారు మాత్రం త‌మ ప‌ద్ధ‌తి మార్చుకోలేదు. చివ‌ర‌కు ఆ చ‌లాన్లు పెరిగి పెరిగి ఏకంగా 70కి చేరుకున్నాయి. ఇక ఆ జ‌రిమానాల మొత్తం అంతా క‌లిసి ఏకంగా రూ.1,04,400 అయింది. అయిన‌ప్ప‌టికీ స‌ద‌రు కారును న‌డిపే వారు లైట్ తీసుకున్నారు. అయితే ఈ విష‌యం గ‌మ‌నించిన పోలీసులు ఓ ప‌నిచేశారు. అదేమిటంటే…

ఈ కారు నంబ‌ర్ పేరిట ఉన్న చ‌లాన్ల‌ను క‌లిపి పోలీసులు కోర్టుకు స‌మర్పించారు. దీంతో కోర్టు వెంట‌నే అత‌న్ని అరెస్ట్ చేయాల‌ని నోటీసులు ఇవ్వ‌గా వాటిని ఆ కార్ ఓన‌ర్‌కు అంద‌జేశారు. దీంతో బుద్ధి వ‌చ్చింద‌ని తెలుసుకున్న కార్ ఓన‌ర్ వెంట‌నే చ‌లానా మొత్తాన్ని ఆన్‌లైన్‌లో సింగిల్ పేమెంట్‌లో చెల్లించాడు. రూ.1,04,400ను ఒకేసారి చెల్లించాడు. దీంతో ఆ కారు నంబ‌ర్‌కు ఇప్పుడు చ‌లాన్లు పెండింగ్‌లో ఏమీ క‌నిపించ‌డం లేదు. ఇంత‌కీ అస‌లు ఆ కారు ఏ కంపెనీదో తెలుసా ? BMW కంపెనీది. అంత మంచి కారు ఉంది క‌నుక‌నే దాన్ని న‌డిపిన వారు ఎప్పుడూ ఓవ‌ర్ స్పీడ్‌తో వెళ్లేవారు. చివ‌ర‌కు అడ్డంగా బుక్క‌య్యారు. ఏది ఏమైనా.. ఇలాంటి వారి ప‌ట్ల ఇంకాస్త క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top