ఊపేస్తున్న ధనుష్ "తంగమగన్" ట్రైలర్.!

“తంగ మగన్”. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయి నెట్ లో హల్చల్ చేస్తోంది. రెండు నిముషాల 53 సెకన్ల ఈ ట్రైలర్ లో స్నేహం, రొమాన్స్, ప్రేమ, పెళ్లి, కుటుంబం, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విలనిజం.. ఇలా అన్ని అంశాలు సమపాళ్లలో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది.  ధనుష్ ఇందులో తమిళ్ అనే కుర్రాడిలా రెండు పాత్రలలో కనిపించనున్నాడు. ఎమీజాక్సన్ తో టీనేజ్ లో ప్రేమలో పడ్డ ధనుష్, ఆ తర్వాత సమంతాను పెళ్ళాడిన ధనుష్ గా రెండు క్యారెక్టర్స్ కి వేరియేషన్స్ చూపించాడు. ఇంతకుముందు ధనుష్ హీరోగా విఐపి (రఘువరన్ బీటెక్) చిత్రాన్ని డైరెక్ట్ చేసిన వేల్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ధనుష్ తన సొంత బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు.

నటి రాధిక,దర్శకుడు కె. ఎస్. రవికుమార్ ధనుష్ తల్లిదండ్రులుగా నటించారు. ఇప్పటికే తమిళ్ లో ఈ చిత్ర పాటలు తమిళ్ లో రిలీజ్ అయి అలరిస్తుండగా, ఈరోజు (డిసెంబర్ 11న) తెలుగులో ఈ చిత్ర పాట్లు విడుదలకానున్నాయి. ‘నవమన్మధుడు’ గా తెలుగులోకి అనువాదం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో డిసెంబర్ 18న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Watch Trailer:

Comments

comments

Share this post

scroll to top