చిన్మయికి చేదు అనుభవం: మౌనం వద్దు.. చెంప చెల్లుమనిపించాలన్న టాప్ సింగర్.!

మీ అనుమతి లేకుండా ఎవరైనా మిమ్మల్ని తాకితే…. వెంటనే నిలదీయండి, అరవండి, చెంప చెల్లుమనిపించండి అని  ప్రముఖ గాయని  చిన్మయి శ్రీపాద ట్విట్టర్ వేధికగా సూచించారు. మనల్ని ఎవరైనా చుట్టుముట్టినపుడు ఏం చేయాలో అర్థంకాక సైలెంట్ అయిపోతాం. నేను కూడా అలాగే అయ్యాను. ఇలా మౌనంగా ఉండటం వల్ల మనల్ని వేధింపులకు గురి చేసే వారు అడ్వాంటేజీగా తీసుకుంటారు…. అని చిన్మయి తెలిపారు.ఇటీవల ఓ ఈవెంటులో పాల్గొన్న ఆమెను కొందరు ఆకతాయిలు చుట్టిముట్టి ఇబ్బంది పెట్టారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి చిన్మయి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడమే కాకుండా ఇదే విషయానికి సంభందించి మరికొన్ని వరుస ట్వీట్లు చేశారు.

నేను పాల్గొన్న ఒక  కార్యక్రమంలో   కొందరు నన్ను చుట్టు ముట్టి అసభ్యంగా ప్రవర్తించారు.. దాంతో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అంటూ తన స్వీయానుభవాన్ని పంచుకున్నారు చిన్మయి. ఎంతో మంది మహిళలు, పురుషులు వారు చిన్న పిల్లలుగా ఉన్నపుడు వేధింపులకు గురయ్యారనే విషయం తెలిసి షాకయ్యాను… ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వారి సొంత ఇల్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌లో చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా పంచుకోవడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే ఎవరూ వాటిని నమ్మడం లేదు అని చిన్మయి తెలిపారు.అంతేకాదు పురుషులు కూడా బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి పంచుకోవడానికి సిగ్గుగా ఫీలవుతారు. మహిళలు ఇందుకు సంబంధించిన సంఘటల గురించి ధైర్యంగా చెప్పడానికి ముందుకు వస్తే ‘ఆమె వాటిని ఎంజాయ్ చేసింది’ అని బ్లేమ్ చేస్తారు… అని చిన్మయి అభిప్రాయ పడ్డారు.

తమకు ఎదురైన సంఘటనల గురించి ఆడ పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పడానికి భయ పడుతున్నారు. ఇలాంటి జరుగుతున్నాయని తెలిస్తే చదువు లేదా పని మానేసి ఇంట్లోనే ఉండి పొమ్మంటారనే భయం చాలా మందిలో ఉంది అని చిన్మయి శ్రీపాద ట్వీట్ చేశారు.కొన్ని సందర్భాల్లో వేధింపులకు గురైన మహిళల పట్ల ఇతర మహిళ ప్రవర్తించే తీరు కూడా సరిగా ఉండదు. నీవు వేసే డ్రెస్సుల వల్ల ఇలా జరిగింది అని నిందలు వేస్తారు. ముందు మహిళలకు ఈ విషయాల్లో ఎలా ప్రవర్తించాలి అనే దానిపై ట్రైనింగ్ ఇవ్వాలి.. దయచేసి లైంగిక వేధింపులకు గురైన బాధితులను… వారి లిప్‌స్టిక్, జుట్టు, స్కిన్ కలర్, దుస్తులు, ప్రవర్తన, టాలెంట్, ఇంటిలిజెన్స్ లాంటి విషయాల్లో బ్లేమ్ చేయడం ఆపండి అని… చిన్మయి ట్వీట్ ద్వారా కోరారు.

Comments

comments

Share this post

scroll to top