తనపై మహేష్ కత్తి చేస్తున్న విమర్శలకు స్పందించిన “పవన్ కళ్యాణ్”..! ఏమని కౌంటర్ ఇచ్చారంటే..?

గత కొన్ని నెలలుగా కత్తి మహేశ్ పై పవన్ ఫ్యాన్స్ దాడికి దిగారు..పవన్ గురించి కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలకు పవన్ అభిమానులు కత్తిమహేశ్ ను చంపేస్తామనేంత వరకు వెళ్లారు..సినిమా హిట్లతో సంభందం లేకుండా ఫ్యాన్స్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..పవన్ ఇప్పుడు జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి రాబోతున్నారు..ఇదే క్రమంలో ఆయనపై విమర్శలు ఎక్కువవుతున్నాయి..ఈ విమర్శలు పవన్ పట్టించుకోనప్పటికీ,ఫ్యాన్స్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.అయితే ఫ్యాన్స్ ఈ విధంగా హద్దులు మీరి ప్రవర్తిస్తుంటే పవన్ స్పందించకపోవడంపై కూడా విమర్శలొస్తున్నాయి.. ఇప్పుడు కత్తి మహేష్ వ్యాఖ్యలపై జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు.

పవన్ మాటల్లోనే.. ” నేను ప్రతి ఒక్కరికి నచ్చడానికి నేను బంగారాన్ని కాదు..నేను కొందరికి నచ్చోచ్చు,కొందరికి నచ్చకపోవచ్చు.. నన్ను ద్వేషించే వాళ్లు వాళ్ళ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు.తప్ప దానివలన ఒరిగేదేం లేదు… నవ్వడానికేమో చాలా చిన్న మజిల్స్ కదలాలి. ఒకరిని ద్వేషించాలంటే శరీరం మొత్తం బ్లడ్ పొల్యూట్ అవుతుంది.. వాడి ఫేషియల్ మజిల్స్ పాడవుతాయి.. తన శరీరమే పాడవుతుంది. నేను వాటిని పట్టించుకోదలుచులేదు.. మీరు కూడా అలానే ఉండండి. నేనేమంటానంటే సహనం ఉండాలి.. 100 శాతం సహనం చూపిద్దాం.. మరి హద్దులు దాటిపోయి మనం చచ్చిపోయేంత సహనం అయితే నేను భరించలేను.. అది నాకు ఇష్టం ఉండదు. మేము ఎవరి మీద దాడి చేయము. మనల్ని దాడి చేస్తున్న వాళ్ళ మీద కనీసం చేతులు కూడా అడ్డు పెట్టకుండా కొట్టమని చెప్తామా ఏంటి. అందుకని చేతులు కట్టుకుని కూర్చొనవసరం లేదు..అలా అని ఎదురు దాడి చేయవల్సిన అవసరం కూడా లేదు. అవసరమైతేనే స్పందిద్దాము. ఒకళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు దాని తీవ్రత ఎంతో చుడండి.. మీకే అర్ధమవుతుంది.. అనవసరంగా ఇలాంటి వాళ్ళను పెంచి పెద్దచేయడం తప్ప ఏముండదు. అందుకే వదిలేసేయండి”..

“మాములుగా నేను టీవీలు ఎక్కువగా చూడను. ఏమి జరుగుతుందని కొందరిని అడుగుతాను.. మరీ నన్ను తిట్టే ప్రోగ్రామ్స్ అయితే సార్ నాకు చెప్పకండి అంటాను. దేశం సుభిక్షముగా ఉంటే చాలు అనుకుంటాను. అలాగే, తిట్టేవాళ్ళు ఉన్నారంటే భరిస్తాను, మీరు సున్నితంగా ఉండకూడదు. మీరు నన్ను సినిమాల నుంచి చూస్తున్నారు. సినిమాలో మనం హీరోలం కాబట్టి అక్కడ విలన్స్ ని కొడతా.. అక్కడ ఎవరు తిరిగి మాట్లాడరు. సినిమా కాబట్టి రెండుమూడు గంటలలో అయిపోతుంది. కానీ, ఇవి పొలిటిక్స్. నన్ను షబ్బీర్ అలీగారు తిడతారు, దానం నాగేంద్ర తిడతారు. ఇప్పుడు ఫంక్షన్స్ లో కలిశామనుకోండి.. బాగా మాట్లాడుకుంటాం.. అలాగే, నేను చాలామందిని తిడతాను.. మేమందరం కలిసి బాగానే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అది మాములు మర్యాద” అని అన్నారు.

Comments

comments

Share this post

scroll to top