తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు రాఘవేంద్రరావు పేరు తెలియని వారుండరు. 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి గుర్తింపు పొందారు. అయితే రాఘవేంద్ర రావు సినిమాలు అంటే వాటిల్లో ముందుగా మనకు గుర్తుకు వచ్చేవి, హీరోయిన్ బొడ్డు, ఇతర శరీర భాగాలపై పండ్లు, కాయలతో కొట్టించడం. ఇది ఆయన స్టైల్. ఆయన తీసే ప్రతి సినిమాలోనూ పాటల్లో ఇలాంటి సన్నివేశాలను కచ్చితంగా పెడతారు. అయితే వాటిని ఇప్పటి వరకు ఏ హీరోయిన్ వ్యతిరేకించలేదు. అలాంటి సీన్లు చేసినా వాటి గురించి ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా కామెంట్లు చేయలేదు. కానీ.. సొట్ట బుగ్గల సుందరి తాప్సీ మాత్రం అలాంటి సీన్ల గురించి ఓ ఘాటైన వ్యాఖ్యనే చేసింది, విమర్శల పాలైంది.
ఈ మధ్యే నటి తాప్సీ ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కె.రాఘవేంద్ర రావుపై కామెంట్స్ చేసింది. తాను ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కదా. అయితే ఆ సినిమాలో ఈ అమ్మడు అందాలను ఆరబోసింది కూడా. ముఖ్యంగా పాటల్లోనైతే ఇక ఆ ప్రదర్శనలు చెప్పలేం. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించింది కె.రాఘవేంద్ర రావే. ఆయన ఈ సినిమాల్లోని పాటల్లో సహజంగానే తన స్టైల్లో తాప్సీ బొడ్డు, ఇతర శరీర భాగాలపై హీరో మంచు మనోజ్‌తో వివిధ రకాల పండ్లు, కాయలను కొట్టించారు. అందులో కొబ్బరికాయ కూడా ఉంటుంది. కొబ్బరికాయతో తాప్సీ నడుంపై మనోజ్ కొట్టే సీన్ ఉంటుంది. అయితే ఆ సీన్‌పైనే తాప్సీ తాజాగా కామెంట్ చేసింది.
కొబ్బరికాయతో బొడ్డుపై కొట్టిస్తే ఎలాంటి శృంగార భావోద్వేగాలు కలుగుతాయో తనకు ఇప్పటి వరకు అర్థం కాలేదని తెలిపింది. దీంతో ఆమె కామెంట్ల పట్ల ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులు భగ్గుమన్నారు. ఇండస్ట్రీకి చెందిన కొందరు నటులు కూడా తాప్సీ కామెంట్లను తప్పు పట్టి వాటిని ఖండిస్తున్నారు. 100కు పైగా చిత్రాలను నిర్మించిన ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావును అలా కామెంట్ చేయడం తాప్సీకి తగదని హితవు చెబుతున్నారు. అభిమానులైతే వెంటనే తాప్సీ క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆమె సినిమాలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే ఆమె తెలుగులో ప్రస్తుతం ఆనందో బ్రహ్మ సినిమా చేస్తోంది. దీంతో ఆ సినీ నిర్మాతలు ఇప్పడు తలలు పట్టుకుని కూర్చున్నారు. సరిగ్గా సినిమా ఇంకొన్ని రోజులైతే విడుదలవుతుందనగా తాప్సీ ఇలా కామెంట్లు చేయడం, వివాదాల్లో ఇరుక్కోవడంతో వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదట. ఇక సినీ అభిమానులైతే తాప్సీకి బాగా పొగరు పట్టిందని, అందుకే పిచ్చి కూతలు కూస్తుందని తిడుతున్నారు కూడా. ఇక ఈ అమ్మడు మరి ఆయనకు క్షమాపణలు చెబుతుందో లేదో వేచి చూడాలి..!
watch video here:
https://www.youtube.com/watch?v=w-CsTD503RY