ఉద్యోగం కోసం తమ్ముడ్ని వదిలి వెళ్లిన ఓ యువతి పంపిన మెసేజ్ ఇది..! చూస్తే కన్నీళ్లొస్తాయి..!

”మాది అస్సాం. మా తల్లిదండ్రులకు మేమిద్దరం కూతుళ్లం. నా తరువాత నా చెల్లెలు పుట్టింది. అయితే అమ్మానాన్నకు కొడుకు పుట్టాలని బాగా కోరిక ఉండేది. దీంతో అమ్మ మరోసారి గర్భం దాల్చింది. కానీ కడుపులో ఉన్నది ఆడ, మగ బిడ్డా, ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉందా, లేదా అన్న వివరాలను తెలుసుకునేందుకు గాను మేమున్న ప్రాంతంలో అధునాతన హాస్పిటల్స్‌ ఏవీ అప్పట్లో అందుబాటులో లేవు. దీంతో మాకు ఆ అవకాశం లేకపోయింది. అయితే మేం భయపడినట్టుగానే నాకు తమ్ముడు పుట్టాడు. కానీ అతనికి అప్పుడే గుండెకు 7 రంధ్రాలు ఉన్నాయని తెలిసింది.

తమ్ముడు అలా పుట్టేసరికి అమ్మానాన్న పడ్డ బాధ అంతా ఇంతా కాదు. మేం కూడా చాలా బాధపడ్డాం. తమ్ముడు పుట్టాడని సంతోషించాలా, అనారోగ్యంతో పుట్టాడని బాధపడాలా అర్థం కాలేదు. చివరకు అతనికి డాక్టర్లు అనేక సర్జరీలు చేసి ఎలాగో బతికించారు. ఇక అప్పటి నుంచి తమ్ముడు ఒక స్పెషల్ అవసరాలున్న వ్యక్తిగా పెరగసాగాడు. తమ్ముడికి సరిగ్గా నడవడం కూడా రాలేదు. 13 సంవత్సరాల వయస్సులో వాడికి నడవడం వచ్చింది. మాటలు కూడా సరిగ్గా మాట్లాడడం ఇంకా రాలేదు. తడబడుతూ మాట్లాడేవాడు.

అలా తమ్ముడు నెమ్మదిగా ఒక్కో విషయం నేర్చుకుంటూ మాకు ఆనందాన్ని పంచుతూ మాకు ఇంకా ఇంకా స్పెషల్‌ అయిపోయాడు. ఎంతలా అంటే వాడు ఇంట్లో లేని ఒక్క క్షణాన్ని కూడా మేం ఊహించుకోలేం. కానీ ఏం చేస్తాం, అందరం వాడి ఎదురుగా ఉండలేం కదా. కుటుంబం గడవాలంటే బయటకు వెళ్లాల్సిందే. ఇప్పుడు నేను వాడికి దూరంగా ముంబైలో ఉన్నా. నాకు నిత్యం, ప్రతి క్షణం వాడే గుర్తుకు వస్తుంటాడు. వాడు ఈ క్షణంలో ఏం చేస్తుంటాడు, నా గురించే ఆలోచిస్తుంటాడు కదా, అని నాకు అనిపిస్తుంది. నేనెప్పుడు ఇంటికి వెళ్లినా నా బుగ్గపై నాలుగు సార్లు ముద్దు పెట్టి మరీ పలకరిస్తాడు. ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో. నేను ఓ వైపు, నా చెల్లి మరో వైపు వాడికి సేవలు చేస్తున్నా, వాడి నుంచి ఏమీ ఆశించం. కేవలం ప్రేమ తప్ప. నాకు తెలిసి వాడు మాకు ఇచ్చినంత ప్రేమ వేరే ఎవరూ తమ అక్కలకు ఇవ్వలేరేమో. ఎందుకంటే వాడు చాలా స్పెషల్‌ కదా..!”

Comments

comments

Share this post

scroll to top