' తలకాయ్" …హార్ట్ టచింగ్ షార్ట్ ఫిల్మ్. నిజజీవితంలో ఈ సిట్యువేషన్ మనకే ఎదురైతే…?

చదువులేకపోయినా తెలివితేటలు బాగా ఉన్న కుర్రాడు.  ఓ అమ్మాయిని మొదటి చూపులోనే  ప్రేమిస్తాడు. ఆ  కుర్రాడి   ఆలోచనలు, గట్స్ నచ్చిన ఆ అమ్మాయి కూడా అతన్ని ప్రేమిస్తుంది. కట్ చేస్తే తనని పెళ్లి చేసుకోవాలంటే మనిషి తలకాయ్ కావాలని, అప్పుడే  మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటారని పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. ప్రేమను గెలిపించుకునేందుకు? తను ప్రేమించిన అమ్మాయి కోసం.. మనిషి తల నరికి తన ప్రేయసికి ఇచ్చాడా..?  అనేది మిగతా ‘తలకాయ్’ షార్ట్ ఫిలిం  స్టొరీ. కామెడీ,  మెసేజ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలింను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు చిత్ర దర్శకుడు బలరామ్ సాధు. టేకింగ్ పరంగా, డైలాగుల పరంగా రచయితగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటాడు.

  • అందరూ మనసిచ్చానంటారు కానీ.. నేను మిమ్మల్ని మనసులో ఉంచుకున్నాను.
  • ధైర్యం చెప్పేవాడు ఫ్రెండ్.. ధైర్యం ఇచ్చే వాడు హజ్ బెండ్.
  • కల నెరవేరాలంటే,, ముందు నిద్రలేవాలి.

వంటి డైలాగులు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మనిషి జీవనం గురించి షార్ట్ ఫిలిం చివరిలో వచ్చే సీన్ ఈ షార్ట్ ఫిలింకు హైలెట్ గా చెప్పుకోవచ్చు.

Watch Short Film:

Comments

comments

Share this post

scroll to top