ఇష్టం కొద్దీ టాటూ వేయించుకుంది. వ‌ద్ద‌నుకుని తీసేస్తే చ‌ర్మం కాలింది..!

ప‌చ్చ‌బొట్టు. ఒక‌ప్ప‌టి ట్రెండ్‌. నేటి త‌రం వారికి అది ఫ్యాష‌న్ అయిపోయింది. చిన్నా, పెద్దా, ముస‌లి, ముతకా, ఆడ‌, మ‌గా తేడా లేకుండా ఎవ‌రు ప‌డితే వారు, ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప‌చ్చ‌బొట్టు పొడిపించుకుంటున్నారు. వాటికే టాటూలని పేరు పెట్టారు. టాటూలు వేసే పార్ల‌ర్లు కూడా వెలిశాయి. దీంతో ఎవ‌రికి న‌చ్చిన టాటూను వారు వేయించుకుంటున్నారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ… టాటూల వ‌ల్ల క‌లుగుతున్న న‌ష్టాలు ఎవ‌రికీ తెలియ‌డం లేదు. న‌ష్టం మాట అటుంచి ఒక్క‌సారి టాటూ వేయించుకుంటే దాన్ని అంత సామాన్యంగా తీసేయ‌లేం. అందుకు చాలా కష్ట‌ప‌డాలి. ఆ యువతి కూడా అలాగే క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. కానీ ఆ కష్టం ఆమెకు ఇంకా ఎక్కువై న‌ర‌కంగా మారింది. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే…

ఆమె పేరు పాసుడా. థాయ్‌లాండ్ వాసి. అయితే అంద‌రిలాగే ఆమెకు కూడా టాటూ వేయించుకోవాల‌నిపించింది. ఇంకేముంది… అస‌లే థాయ్ లాండ్ క‌దా. అక్క‌డ ర‌క ర‌కాల టాటూలు వేసే పార్ల‌ర్లు బాగానే ఉంటాయి. వాటిలో ఒక దాంట్లోకి వెళ్లి ఎంచ‌క్కా ఛాతికి పైన‌, గొంతు కింద ఓ టాటూ వేయించుకుంది. అయితే తీరా వేయించుకున్నాక కొద్ది రోజుల వ‌ర‌కు బాగానే ఉంది. కానీ ఆ టాటూ న‌చ్చ‌లేదేమో వెంటనే దాన్ని తీసేయాల‌నుకుంది. కానీ అదంత ఆషామాషీ ప‌నికాదు. అందుకోసం చాలా కష్ట‌ప‌డాలి. ఈ క్ర‌మంలోనే పాసుడా ఓ లేజ‌ర్ ట్రీట్‌మెంట్ సెంట‌ర్‌కు వెళ్లింది.

లేజ‌ర్ ట్రీట్‌మెంట్ ద్వారా ఆ టాటూను తీయించాల‌నుకుంది పాసుడా. అలాగే చేసింది కూడా. కానీ అది విక‌టించింది. దీంతో చ‌ర్మం కాలింది. ఆ త‌ర్వాత బొబ్బ‌లెక్కిపోయింది. కొద్ది రోజుల‌కు గాయంగా మారి పైన ఉన్న చ‌ర్మం అంతా ఊడి వ‌చ్చింది. ఇప్ప‌టికి గాయం కొంత తగ్గినా దాని తీవ్ర‌త‌ను ఆమె అనుభ‌విస్తోంది. ఈ క్ర‌మంలోనే పాసుడా త‌న‌కు జ‌రిగిన ఈ న‌ష్టం ప‌ట్ల విచారిస్తూ ఆ టాటూకు చెందిన ఫొటోల‌ను, త‌న‌కు అయిన గాయం ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. త‌న‌లా ఎవ‌రూ చేయ‌కండ‌ని ఆ పోస్టుల్లో సందేశం పెట్టింది. అవును మ‌రి, అలా ఎవ‌రైనా చేస్తే గాయం అంత కావ‌చ్చు క‌దా..! ఎందుకైనా మంచిది టాటూల‌ను తీయించాల‌నుకునే వారు కాసింత జాగ్ర‌త్త‌గా ఉండ‌డం బెట‌ర్‌..!

Comments

comments

Share this post

scroll to top