తాజా క్రికెట్ ర్యాంకింగ్స్…. భేషుగ్గా టీమ్ ఇండియా.

ప్రపంచ కప్ ముగిసింది… అస్ట్రేలియా సగర్వంగా వరల్డ్ కప్ ను అందుకుంది.  మన ఐపిఎల్ లో సిక్స్ ల వర్షం కురిసింది.. ముంబాయి ఇండియన్స్ ట్రోపి ని చేజిక్కించుకుంది.  ప్రపంచ దేశాల సంగతి పక్కన పెడితే మన దేశంలో క్రికెట్ ఓ మతంలాంటింది అంటే అతిశయోక్తి కాదు.  క్రికెట్ ఫార్మాట్ ఎదైనా కళ్లల్లో ఒత్తులేసుకొని చూసే హార్డ్ కోెర్ ఫ్యాన్స్  మన దగ్గర  ఉన్నారనేది వాస్తవం.

ధనాధన్ బాధుడు టి-ట్వంటీ  అయినా,  క్లాస్ గా ఆడే  వన్డే మ్యాచ్ అయినా, రోజుల తరబడి క్రీజ్ లో పాతుకుపోయే టెస్ట్ మ్యాచ్ అయినా ఇలా అన్నింటిని ఆధరించే అభిమానులకు ఇండియా లో కొదువ లేదు.

ఒక్క సారి ఫార్మాట్ల వారీగా ఏయే టీమ్ ర్యాంకింగ్ ల వరుసలో ముందుందో చూద్దాం….!!!

టెస్ట్:

test

 

ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్న సఫారీ టీమ్ టెస్ట్ ర్యాంకింగ్ లో మొదటి స్టానంలో ఉంది. నిప్పులు చెరిగే బౌలర్లు, నిలకడైన బ్యాట్స్ మన్ తో సౌత్ ఆఫ్రికా జట్టు  చాలా పటిష్టంగా ఉంది.. 5 రోజుల ఆటకు సరిపడ ఫిట్ నెస్ ఆ టీమ్ లో ప్రతి ఒక్క ఆటగాడికి ఉంది. అదృష్టం అడ్డం తిరిగిందిలే కానీ వరల్డ్ కప్పును కాస్త లో చేజార్చుకున్నారు. మనం మాత్రం  టెస్ట్ ఫార్మాట్ లో ఫోర్త్ పొజీషన్ లో ఉన్నాం.

 

వన్డ్ ఫార్మాట్:

odi

 

నాల్గో సారి విశ్వ విజేత కిరీటాన్ని అందుకున్న కంగారుల జట్టు వన్డే ర్యాంకింగ్ లో ఫస్ట్  ప్లేస్ లో ఉంది.  వారి చేతిలో  వరల్డ్ కప్ సెమీస్ లో ఓడిన ఇండియా  రెండవ ప్లేస్ లో ఉంది..  వన్డే క్రికెట్ అంటే చాలు పూనకం వచ్చినట్టు ఆడే ఆస్ట్రేలియా మొదటి స్థానాన్ని మ్యాక్జిమమ్ తమ దగ్గరే ఉంచుకుంటుంది. మనకంటే ఒకే ఒక్క పాయింట్ వెనుక ఉన్న న్యూజిలాండ్ మన స్థానం పై కన్నేసింది.

 

టి-ట్వంటీ ఫార్మాట్:

t20

 

ఐపిఎల్ అంటూ హడావుడి అంతా మనమే చేశాం… 20 ఓవర్ల మ్యాచ్ కు ఓ రూపాన్ని ఇచ్చాం…  కానీ టి-ట్వంటీ ఫార్మాట్ లో మాత్రం మనం సెకెండ్ ప్లేస్ లో ఉన్నాం.  మన  రావణ దేశం మాత్రం ఈ పొట్టి క్రికెట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top