మరో సారి జవానుల పైన దాడి చేసిన ఉగ్రవాదులు, నలుగురు జవానులు మృతి..!!

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతం లో మరో సారి ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ పైన దాడి చేసారు ఇవ్వాళ తెల్లవారుజామున. పొద్దున 5 గంటల సమయం లో ఇద్దరు తీవ్రవాదులు ఆర్మీ బేస్ పైన దాడి చేసారు. ఈ ఘటన లో నలుగురు జవానులు మృతి చెందారు, మరణించిన నలుగురిలో మేజర్ కూడా ఉన్నారు.

యుద్ధానికి దారితియ్యనుందా..:

ఉగ్రవాదుల వరుసదాడుల నేపధ్యం లో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను అంతమొందించడానికి పాకిస్తాన్ పైన దాడి చెయ్యాల్సి వస్తుంది, ఇలాగె వరుస దాడులు జరుగుతూ ఉంటె కచ్చితంగా పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటిస్తారు, చైనా పాకిస్తాన్ కు అండగా ఉండటం మూలాన, క్రమేణా ప్రపంచ దేశాల మధ్య యుద్ధం గా కూడా మొదలయ్యే ఆస్కారం ఉంది. లేదా యూరి సర్జికల్ స్ట్రైక్ తరహాలో ఉగ్రవాదులను అంతమొందించాలి. ఏది ఏమైనా వీరమరణం పొందిన జవానుల కొరకు ఉగ్రవాదుల పైన ప్రతీకారం తీర్చుకోవాల్సిందే.

14 న మొదలు..:

పుల్వామా ఉగ్రవాద దాడిలో 49 మంది CRPF జవానులు మృతి చెందారు, ఫిబ్రవరి 14 న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ సంఘటన లో చాలా మంది జవానులు గాయపడ్డారు, కాశ్మీర్ కి చందిన 22 ఏళ్ళ కుర్రాడు జవానులు వెళుతున్న ట్రక్ కి ఎదురుగా కారు తో వెళ్లి తనని తాను కారు తో సహా పేల్చుకుని 49 మంది జవానులను బలిగొన్నాడు, ఈ కుర్రాడు పాకిస్తాన్ కి చెందిన తీవ్రవాద సంస్థ అయిన జైష్-ఈ-మొహమ్మద్ కి సంబందించిన వాడు, దాడి జరిగిన వెంటనే దాడికి పాల్పడిన కుర్రోడి వీడియో ని విడుదల చేసారు జైష్-ఈ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ ప్రస్తుతం పాకిస్తాన్ నుండే కార్యకలాపాలు సాగిస్తుంది, ఒక రకంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ ప్రభుత్వమే ఈ సంస్థ ద్వారా జవానులు పైన ఉగ్ర దాడి జరిపిందని అందరు గట్టిగా నమ్ముతున్నారు.

హ్యాకింగ్ నుండి పాక్ ప్రధాన మంత్రి ఫేస్బుక్ పేజి లో మనోళ్ల మింగుడు వరకు.. :

పాకిస్తాన్ ఫేస్బుక్ బడా గవర్నమెంట్ పేజెస్ నుండి వెబ్సైట్స్ వరకు హ్యాక్ చేస్తున్నారు మనోళ్లు, ఇక పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫేస్బుక్ పేజి లో మనోళ్లు మామూలు రచ్చ చెయ్యట్లేదు, మాములు తిట్ల నుండి పచ్చి బూతుల వరకు తిట్టి పడేస్తున్నారు, ఇండియన్స్ వి ఎన్ని కామెంట్స్ డెలీట్ చేసినా మనోళ్లు మాత్రం పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యువత పాకిస్తాన్ ప్రధాని ఫేస్బుక్ అకౌంట్ లో అతగాడిని మామూలుగా ఆటాడుకోవట్లేదు. ‘మా RTC X Roads పార్కింగ్ కలెక్షన్స్ అంత ఉండదు మీ పాకిస్తాన్ బడ్జెట్, మీకెందుకు రా మాతో *బీప్*’ ఇలాంటి కామెంట్స్ తో పాకిస్తాన్ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, కొన్ని కోట్ల మంది పాకిస్తాన్ పైన ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నారు.

Tweet:

Comments

comments

Share this post

scroll to top