మీరు వాడే “తేనే (హనీ)” స్వచ్ఛమైందా.? లేక కల్తీదా.? ఈ 5 సింపుల్ ట్రిక్స్ తో తెలుసుకోండి!

నేడు ఎక్క‌డ చూసినా క‌ల్తీ ప్ర‌పంచం న‌డుస్తోంది. మ‌నం తినే, తాగే ప్ర‌తి ప‌దార్థం కూడా క‌ల్తీ అవుతోంది. వ్యాపారులు లాభాపేక్ష‌తో ప్ర‌తి ప‌దార్థాన్ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు కల్తీ చేస్తూ జ‌నాల‌ను దోచుకుంటున్నారు. ఈ క్రమంలో వారు ల‌క్ష‌ల రూపాయ‌లు గ‌డిస్తున్నారు. అయితే న‌కిలీలు, కల్తీల బారి నుంచి ర‌క్షించాల్సిన సంబంధిత ప్ర‌భుత్వ అధికారులు మాత్రం నోరు మూసుకుని కూర్చుంటున్నారు. దీంతో వ్యాపారులు ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా మారింది. కాగా నేడు ప్ర‌స్తుతం కల్తీ అవుతున్న ప‌దార్థాల్లో చెప్పుకోద‌గిన‌వి అనేక‌మే ఉన్నాయి. అయితే వాటిలో ముఖ్య‌మైంది తేనె కూడా ఒక‌టి.

honey

తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఎన్నో ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, పోష‌కాల‌కు తేనె నిలయం. ప‌లు అనారోగ్యాల‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీరానికి శ‌క్తినివ్వ‌డంలో తేనెకు అధిక ప్రాధ‌న్య‌త ఉంది. ఆయుర్వేదంలోనూ తేనెను ప‌లు ఔష‌ధాల‌తోపాటుగా ఇస్తారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో తేనె వాడ‌కం ఎక్కువ‌వ‌డంతో వ్యాపారులు దాన్ని కూడా క‌ల్తీ చేసి మార్కెట్‌లో విక్ర‌యిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌నాల‌కు అస‌లు తేనె ఏదో న‌కిలీ తేనె ఏదో గుర్తించ‌డం క‌ష్ట‌త‌ర‌మైంది. అయితే కింద ఇచ్చిన కొన్ని సూచ‌న‌లు పాటిస్తే న‌కిలీ తేనె ఏదో ఇట్టే తెలుసుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు చూద్దామా!

watch video here:

https://www.youtube.com/watch?v=7CB7_-GpR4c

  • సాధారణంగా మొలాసిస్, మొక్కజొన్న పిండి తదితర పదార్థాలను ఉపయోగించి నకిలీ తేనెను తయారు చేస్తారట.
  • నకిలీ తేనెను గుర్తించడం చాలా సులభమే. కొద్దిగా తేనె తీసుకుని దానికి 2, 3 చుక్కల వెనిగర్ ఎస్సెన్స్ కలపాలి. అనంతరం వాటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా వచ్చిన మిశ్రమం ఎక్కువగా నురగను విడుదల చేస్తుంటే అది నకిలీ తేనెగా గుర్తించాలి. ఎందుకంటే నకిలీ తేనె కోసం ఉపయోగించే పదార్థాల్లో చక్కెర కూడా ఉంటుంది. ఇది వెనిగర్‌తో కలిసినప్పుడు నురగలాంటి ద్రవాన్ని ఇస్తుంది. అసలైన తేనె ఇలా నురగను ఇవ్వదు.

honey

  • కొద్దిగా తేనెను తీసుకుని బొటనవేలిపై వేయాలి. అనంతరం దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ తేనె బొట్టు వేలిపై చుట్టూ విస్తరిస్తే దాన్ని నకిలీ తేనెగా గుర్తించాలి.
  • ఒక టేబుల్‌స్పూన్ తేనెను ఒక గ్లాస్ నీటిలో వేయాలి. స్వచ్ఛమైన తేనె గ్లాస్ అడుగు భాగానికి చేరుతుంది. అదే నకిలీదైతే సులభంగా నీటిలో కరుగుతుంది.
  • ఓ అగ్గిపుల్లను తీసుకుని దాని చివరి భాగాన్ని తేనె బొట్టులో ముంచాలి. అనంతరం పరిశీలిస్తే ఆ అగ్గిపుల్ల మండాలి. దీంతో తేనె అసలైనదే అని తెలుస్తుంది. ఎందుకంటే తేనెకు మండే స్వభావం ఉంటుంది. కాబట్టి నకిలీ తేనె మండదు

jar of honey with honeycomb on wooden table

Comments

comments

Share this post

scroll to top