సచిన్ మైలు రాయి పై కన్నేసిన కోహ్లీ… సచిన్ రికార్డునే తిరగరాసేందుకు రెడీ!!

కోహ్లీ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్. పరుగుల యంత్రం. కోహ్లీ క్రీజులో ఉంటే చాలు ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారాల్సిందే. ప్రత్యర్థికి వణుకు పుట్టాల్సిందే. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ పరుగుల వీరుడు ప్రపంచ రికార్డులన్ని తిరగరాస్తున్నాడు.క ఎంతలా అంటే క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ తన క్రికెట్ కెరీర్‌లో నెలకొల్పిన ప్రపంచ రికార్డులన్నీ మార్చిపోయేంతలా.

ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియాతో ఆడుతున్న వన్డే సిరీస్ లో నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 9 వేల పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. దింతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 9000 పరుగులు చేసిన కెప్టెన్ గా ఘనత సాధించాడు.

రెండో వన్డేలో 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. అంతే కాకుండా ఈ మ్యాచ్ లో శతకం బాది 40 సెంచరీలు పూర్తి చేశాడు. కోహ్లీ కెప్టెన్‌గా 159 ఇన్నింగ్స్‌ల్లో 9 వేలు పూర్తి చేస్తే.. పాంటింగ్‌ అందుకు 203 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 9000 పరుగులు చేసిన కెప్టెన్లలో కోహ్లీ కంటే ముందు స్మిత్‌ (220 ఇన్నింగ్స్‌లు), ధోని (253), అలెన్‌ బోర్డర్‌ (257), ఫ్లెమింగ్‌ (272)లు ఈ జాబితాలో ఉన్నారు.

ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు భారత క్రికెట్ మాస్టర్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన వన్డే కెరీర్‌లో మొత్తం 49 సెంచరీలు చేశాడు. ఇపుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రికార్డును బద్ధలు కొట్టేందుకు కేవలం 9 సెంచరీల దూరంలో ఉన్నాడు. దింతో ఈ రికార్డును కోహ్లీ తిరగరాస్తాడు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Watch video:

Comments

comments

Share this post

scroll to top