ఆ గుడి “కలుషిత” నీటిని శుద్ధి చేస్తుంది!…అంతేకాదు “వ్యవసాయం, నిత్య అవసరాలకు” నీరు సరఫరా చేస్తుంది!

ఏదన్నా కొత్త నిర్ణయం తీసుకోవాలని అందరూ అనుకుంటారు..కానీ నిర్ణయం తీసుకున్నవారు, దానిని ఆచరణలో పెట్టినవారే గొప్పవాళ్లవుతారు..అలాంటి నిర్ణయాలు సైతం పదిమందికీ ఆదర్శంగా నిలుస్తాయి..

కర్ణాటక ఉడిపిజిల్లాలోని సాలిగ్రామలో ఉందీ శ్రీ గురు నరసింహస్వామిఆలయం. కొన్ని వేల ఏళ్ళ చరిత్ర గల ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం సాలిగ్రామ రాతితో చెక్కబడింది..కోరిన కోర్కెలు తీర్చే స్వామివారిని కావటంతో…ఏటా ఈ స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులు పెరుగుతూనే ఉన్నారు..అయితే ఇదే ఇక్కడ సమస్యగా మారింది. ఒక్కో శనివారం భక్తుల సంఖ్య వందలు దాటి వేలకు పెరిగిపోతూండటంతో..నీటి వ్రుధా కూడా అంతే కర్ణాటక ఎక్కువయిపోతోంది..దీనితో మురికి నీరు వ్యవసాయాన్ని నాశనం చేసే స్థితికి చేరుకుంది. దీంతో ఆలయ అధికరులు ఒక నిర్ణయానికొచ్చారు.ఒక నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటు చేసారు..బెంగళూరు లోని ఓ సంస్థ సహకారంతో ఏర్పాటుచేసిన ఈ ప్లాంటు ఉపయోగించిన నీటిని శుద్ధి చేసి తిరిగి వ్యవసాయ అవసరాలకు పనికివచ్చేలా చేస్తుంది. సీక్వేన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ అనే ఈ ప్లాంటు 50000 లీటర్ల నీటిని శుద్ధిచేసి విడుదల చేస్తుంది.సుమారు 30 లక్షల రూపాయలను ఈ ప్లాంటు కి వినియోగించగా..ఇందుకు కర్ణాటక బ్యాంకు ఆర్ధిక సహకారాన్ని అందించింది. దక్షిన కన్నడ లోని క్షత్రియ ధర్మశాల కూడా ఇలాంటి సదుపాయాన్ని కలిగి ఉన్నప్పటికీ ఉడిపిలో ఇలాంటి నీటి శుద్ధి ప్లాంట్ ఇది ఒక్కటే.
మురుగు నీటిని లేదా బురద నీరు ఈ పద్ధతిలో వంతుల వారీగా శుభ్రపరచబడుతుంది. నీటిని శుద్ధిచేయటానికి ఈ ప్రక్రియలో ఆక్సిజన్ ను వినియోగిస్తారు.. అమెరికా, కెనడా, మరియు యూరప్ దేశాలలో గత 25 సంవత్సరాలలో ఇలాంటి 13వేల ప్లాంట్లు నెలకొల్పబడి ఉన్నారు

Comments

comments

Share this post

scroll to top