దేశబాషలందు తెలుగు లెస్సా.. అని తెలుగు భాషను కీర్తిస్తూ శ్రీకృష్ణదేవరాయలు మన మాతృభాషను వేయినోర్ల పొగిడారు. పనస తొనల కన్నా, జుంటితేనే కన్నా…మన తెలుగు భాష మరింత మధురం అంటారు. ప్రపంచ అన్ని భాషలతో పోల్చితే తెలుగు రూటే సెపరేట్..అర్ధం-శబ్ధం-ధ్వని ఇలా తెలుగు అక్షరమాలలోని ఒక్కొక్క అక్షరానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చాలా సార్లు మనం తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అనడాన్ని వింటుంటాం, చదువుతుంటాం. అయితే ప్రపంచంలో ఇన్ని దేశాలుండగా మన భాషను ఇటాలియన్ భాషతోనే ఎందుకుపోల్చారు. అసలు ఇటలీకి మన తెలుగుకు ఉన్న సంబంధమేంటి ? అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా.? అయితే ఇప్పుడు తెలుసుకోండి.
ప్రపంచంలోని రెండు భాషలకే ప్రత్యేక ముగింపు ఉంటుంది..అదేంటి అంటే ప్రపంచంలో తెలుగు,ఇటలీ తప్ప మిగిలిన అన్ని భాషలే హలంతాలు అంటే హల్లుతో అంతం అవుతాయి, తెలుగు ఇటలీ భాషలు మాత్రమే అజంతాలు అంటే అచ్చుతో అంతమవుతాయి.
1.ఉదాహరణ; రోడ్డ్ (ఇంగ్లీష్)= ర్+ఓ+డ్+డ్( డ్ అనేది హల్లు, అంటే హల్లంతం)
2.ఉదాహరణ: రోడ్డు(తెలుగు)=ర్+ఓ+డ్+డ్+ఉ( ఉ అనేది అచ్చు, అంటే అజంతం).
తెలుగు, ఇటాలియన్ లోనే ఇలాంటి అజంతాలుంటాయ్ , దానికి తోడు ఇటలీకి ఇండియా ఈస్ట్ లో ఉంటుంది ..సో దీన్నంతా పరిగణలోకి తీసుకొని తెలుగును ఇటాలియన్ ఆప్ ధి ఈస్ట్ అంటారు. మొదటిగా ఈ పదాన్ని ఉపయోగించింది
వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి.
తెలుగు భాష ఇతర ప్రత్యేకతలు:
- తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది.
- ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో హిందీ, బెంగాలీ తర్వాత మూడవ స్థానములోను నిలుస్తుంది.
- అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళములతో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.