ఇదో పాఠకుడి ప్రేమకథ…. ఫ్రెండ్ ఎంట్రీతో తిరిగింది యూటర్న్!!

హాయ్ ఫ్రెండ్స్..జీవితం చాలా విచిత్రమయింది.. నిజమయిన స్నేహం కూడా కొన్ని సార్లు సమస్యలు తీసుకొస్తుంది.అదే జరిగింది నా జీవితంలో.. నేను మా మరదల్ని ప్రేమించా..తను మొదట్లో ఇష్టం లేదు అన్నా చిన్నగా చిన్నగా కొంచం కొంచం మాట్లాడటం చేస్తూవుండేది.ఎంతలా ప్రేమించాను అంటే ఏ అమ్మాయిని చుసిన తనే..ఏ ఆలోచన వచ్చిన తనే..తన గురించి ఆలోచించని క్షణం లేదు.నేను నా ఫ్రెండ్ అనుకున్న ఒక అమ్మాయికి ఈ విషయం చెప్పి అడగమన్న..దానితో వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు…ఇక్కడ అసలు విషయం మొదలు అయింది.నా మీద లేనిపోనివి కహానిలు చెప్పి చిన్నగా నన్ను ఒక యదవని చేసింది.

ఆ విషయం తెలిసి నేను ఫ్రెండ్ అనుకున్న అమ్మాయికి దూరంగా వున్న..ఇక నా మరదలు నాతో మాట్లాడటం మానేసింది పూర్తిగా.. ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందు తిరుగుతూ వుంటే పడే బాధ ప్రత్యక్షంగ అనుభవించా..ఆ బాధ వర్ణనాతీతం..కేవలం నా మరదలుని చూస్తూ ఉండోచని చదివిన చదువుకి సంభంధం లేని ఉద్యోగంలో చేర..ఇది ఇలా వుండగా ఫ్రెండ్ అనుకున్న అమ్మాయి ఫ్రెండ్షిప్ అని విసిగిస్తూ వుండేది.అది తట్టుకోలేక ఫోన్ నంబర్స్ మార్చుకున్న అయిన నా దరిద్రానికి తెలిసిపోయేవి.ఒక సంవత్సరం తరువాత నా మరదలుని మర్చిపోదాం అని ఎంతగా ప్రయత్నించిన నా వల్ల కాలేదు ఊరులో ఉండలేక నేను హైదరాబాద్ వచ్చేసా.కోచింగ్ చేరిపోయా ఉద్యోగాల వేటలో వున్న..ఇప్పుడు ఫ్రెండ్ అనుకున్న అమ్మాయి ఇంక ఇంక విసిగించటం మొదలు పెట్టింది.

Telugu Funny Quotations on Girls 3 - QuotesAdda.com

ఇప్పుడు నా మరదలు తన చదువు అయిపోయి హైదరాబాద్ వచేసింది.తను కనిపించకుండా వుంటే ఎలా ఉండేదో కాని కనిపించింది. మళ్ళి ఆశలు మొదలయ్యాయి.తనకి చెపితే ఇష్టం లేదు అంటుంది..పోనీ తన గురించి ఆలోచించ కుండా వుందం అనుకుంటే అది జరగని పని..చివరికి తెలిసిన నిజం ఎమిటంటే నేను ఫ్రెండ్ అనుకున్న అమ్మాయి నన్ను ప్రేమించి నా గురించి తనకి చెడుగా చెప్పింది..ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కనీసం గుర్తించని పరిస్థితిలో వున్న.. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించదు..నన్ను ప్రేమించిన అమ్మాయిని నేను ప్రేమించలేను.

 

Comments

comments

Share this post

scroll to top