ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ విజయకేతనం.

ప్రో కబడ్డీలో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో తెలుగు టైటాన్ జట్టు బెంగాల్ వారియర్స్ ను మట్టి కరిపించింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో కెప్టెన్ రాహుల్ చౌదరి తన అద్భుతమైన ఆటతో టైటాన్స్ జట్టును గెలిపించాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచి తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

ఫస్ట్ ఆప్ వరకు తెలుగు టైటాన్స్ పై బెంగాల్ వారియర్స్ పై చేయి సాధించింది. సెకండాఫ్ లో పుంజుకున్న తెలుగు టైటాన్స్ సమిష్టి ఆటతీరును ప్రదర్శించి  30-32 పాయింట్లతో మ్యాచ్ ను కైవసం చేసుకుంది. మ్యాచ్ మరో అయిదు నిమిషాల్లో ముగుస్తుంది అనే సమయంలో….  పలు కీలక మలుపులు తిరిగాయి ఆటలో, బెంగాల్ ఆటగాడు లీ.. సూపర్ రైడ్ తో నాలుగు పాయింట్లు సాధించాడు, ఇక్కడ నుండి తెలుగు టైటాన్స్ చాలా చాకచక్యంగా ఆడింది. ఆట ఒక్క నిమిషం ఉందనగా రైడ్ కు వెళ్లిన రాహుల్ చౌదరి కోర్టు లోపలికి వెళ్లి మరీ రెండు పాయింట్లు సాధించాడు.

టోటల్ గేమ్ లో స్టార్ రైడర్  దీపక్  హుడా రైడ్ కు వెళ్లిన ప్రతిసారీ పాయింట్లు తీసుకువచ్చాడు. అంతా బాగున్నా తెలుగు టైటాన్స్ డిఫెన్స్ మాత్రం ఆశించినంతగా లేదు. ఈ ఆటతీరుతో టైటిల్ ను సాధించడం మాత్రం అసాధ్యం, ఎందుకంటే యుముంబా, బెంగుళూరు బుల్స్ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తూ టైటిల్ వేటలో ముందున్నాయి. ఆ జట్లను నిలువరించాలంటే తెలుగు టైటాన్స్ డిఫెన్స్ మెరుగవ్వాలి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top