నాయకుడంటే నడిపించేవాడు, నోట్లిచ్చేవాడు నోటికొచ్చింది మాట్లాడేవాడు కాదు.. ఓటు వేసే ముందు మీకు ఏం కావాలో తెలుసుకోండి..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి జోరందుకుంది, నామినేషన్ ల ప్రక్రియ పూర్తి కావడం తో అభ్యర్థులు ప్రచారం లో మునిగిపోయారు. తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలు, ఆంధ్ర లో అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలు ఉండటం తో ఇరు రాష్ట్రాల్లోనూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు నాయకులు. జనాలు ఓటు వేసే ముందు వారికి ఏం కావాలో ఆలోచించుకోవాలి.

ఎన్నికల్లో నాయకులు ఇచ్చే హామీలు నమ్మి ఓట్లు వేసే వారు కొందరు, నాయకులు ఇచ్చే నోట్లు తీసుకొని ఓట్లు వేసే వారు మరికొందరు. అయితే జనాలకు ప్రధమంగా ఏది ముఖ్యం. మనం నివసిస్తున్న ఊరులో మనకు అతిముఖ్యమైనవి ఏవి.?

నీరు :

త్రాగు నీరు అతి ముఖ్యమైన వాటిలో మొదటిది. మనిషికి నీరు ఎంతో అవసరం, ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తే జనాలకు సగానికి పైగా ఇబ్బందులు తొలిగిపోతాయి.

ఆరోగ్యం :

పరిసరాల్లో చెత్తా చెదారం పేరుకొని పోయినా, డ్రైనేజీ సిస్టం సరిగ్గా లేకపోయినా రోగాలు పెరిగిపోతాయి, అనారోగ్యానికి గురవుతాం. మన ఇంటిని కాదు, పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుందాం, మున్సిపాలిటీ వాళ్ళు సరైన చెర్యలు చేపడితే అనారోగ్య బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక మున్సిపాలిటీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

రోడ్లు :

మెయిన్ రోడ్డు మినహాయిస్తే, మిగిలిన ఏరియా లలో రోడ్డు లను సరిగ్గా పట్టించుకోరు, కొన్ని ప్రముఖ నగరాల్లోనే రోడ్ ల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయ్, కనుక రోడ్ లు బాగు చేపించాలి.

రైతులకు అండగా, పల్లెటూర్లో రవాణా వ్యవస్థ, ఆసుపత్రి :

రైతులకు కష్ట సమయాల్లో అండగా నిలబడాలి, పల్లెటూర్లో రవాణా కు ఇబ్బందులు కలుగకూడదు, గవర్నమెంట్ బస్సు లు ఎక్కువగా పల్లెలకు నడపాలి, పల్లెటూరి రోడ్డులను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపిస్తుండాలి, మంచి ప్రభుత్వ ఆసుపత్రి పల్లెకు దేగ్గర్లో ఉండాలి.

కరెంటు, ఆసుపత్రి :

పల్లెలో అయినా పట్టణాల్లో అయినా నీరు రోడ్లు ఎంత అవసరమో కరెంటు, ఆసుపత్రి కూడా అంతే అవసరం.

త్రాగు నీరు, రోడ్లు, కరెంటు, ఆసుపత్రి, శుభ్రత… ఇవన్నీ సరిగ్గా చూసుకొనే నాయకుడిని ఎన్నుకోండి, ఇవి మనకు అవసరమైనవి. స్కీం లు రాళ్ళూ వజ్రాలు కాదు మనకు కావలసింది, మనం బ్రతికున్న ఊర్లో మనకు కనీస సౌకర్యాలు ఉండాలి, అందుకోసం మనం ఎన్నుకునే నాయకులు వీటిని ఖచ్చితంగా అమలు చెయ్యాలి, ఎన్నుకున్నాక ఒక వేళ చెయ్యని పక్షం లో అతడికి ఓటమి ఎంత భయంకరంగా ఉంటాదో చూపియ్యలి. అందుకోసం ఇంకోసారి వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఊర్లో జనాలు తిరుబాటు చేస్తే అదే వారి ఓటమి, అప్పుడు ఖచ్చితంగా ఊర్లో ఉండే సమస్యలను తీరుస్తారు.

జనాలు ఎన్నుకున్న నేతలు జనానికి ఏమి చెయ్యనప్పుడు జనమంతా కలిసి తిరుగుబాటు చేస్తే జనం కోసం పనిచేయక ఇంకెవరి కోసం చేస్తారు. ఆలోచిస్తే భవిష్యత్తు బాగుపడదు, ఆచరిస్తే భవిష్యత్తే కాదు, ప్రస్తుత స్థితి కూడా బాగుంటుంది.

 

Comments

comments

Share this post

scroll to top