తెలుగు సినిమాలకు బాహుబలి గండం!!

రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి ని చూసి ఇతర సినిమాలు జడుసుకుంటున్నాయా? కలెక్షన్ల  పరంగా నిలదొక్కుకోవాలంటే బాహుబలి ని తప్పించుకోవాల్సిందేనా?  నిజంగానే తెలుగు సినిమాలకు బాహుబలి గండం ఉందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.

రెండు సంవత్సరాలు, అకుంఠిత దీక్షతో శ్రమించి, అత్భుత గ్రాఫిక్స్ ,చారిత్రాత్మక కథ తో విడుదలకు రెడీ కాబోతున్న చిత్రం బాహబలి, ఇక ఈ సినిమా ప్రచారం కొరకు ఉపయోగించని సాధనం లేనే లేదని చెప్పాలి. పోస్టర్లు , ఫస్ట్ లుక్ ల దగ్గర నుండి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. టెక్నాలజి యూజ్ చేయడంతో తలపండిన రాజమౌళి తన బాహుబలి గురించి ఆల్ మోస్ట్ ఆల్ అన్ని వర్గాల వారు మాట్లాడే విధంగా చేసుకున్నాడు.

bahubali relese date

 

అలాంటి సినిమాను ఎదిరించి నిలవడం అసాధ్యం అని ఇతర సినిమాల దర్శక నిర్మాతలు  అనుకుంటున్నాయట, అందుకే తమ సినిమాలను బాహుబలి గండం నుండి తప్పించుకోవడం కోసం  బాహుబలి విడుదలకు  తమ సినిమాల విడుదలకు  కనీసం 15 రోజులు గ్యాప్ ఉండాలని  చూసుకుంటున్నారట దర్శకులు.

SERIAL MOVIES IN JULY

ఇది నిజమే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు, ఇప్పటికే గుణశేఖర్ ప్రెస్టేజియస్ మూవీ రుద్రమదేవి వాయిదా కూడా పడింది. గ్రఫిక్ విషయంలో కొంచెం మెరుగులు దిద్దడానికే వాయిదా అని చెబుతున్నప్పటికి, అసలు కారణం బాహుబలి గండమే అని టాక్ . వాస్తవానికి జూన్26 న రుద్రమదేవి విడుదల కావాలి కానీ అది ఇప్పుడు వాయిదా పడింది.

rudramadevi poster

మహేష్ శ్రీమంతుడు కూడా వాయిదా పడుతుందనే సమాచారం అందుతుంది. ఈ సినిమా , జులై 17 న విడుదల అవుతుంది అనే ప్రచారం జరిగింది. కానీ జులై 10 న బాహుబలి విడుదల మాత్రం కన్పాం అయ్యింది.సో ఈ పరిస్ధితుల్లో 7 రోజుల గ్యాప్ లో శ్రీమంతుడు విడుదల అయితే కలెక్షన్ల వసూలు పరంగా ప్రాబ్లమ్ అవుతుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తమ సినిమాను వాయిదా వేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది.

Srimanthudu-Movie-Official-Teaser-Posters-Wiki-Ft.-Mahesh-Babu-Shruti-Haasan

ఇక కిక్ -2  విడుదల ను జులై 3 న అని ప్రకటించేశారు,ఇప్టపి వరకు వాయిదా అనే మాట ఆ సినిమా దర్శక నిర్మాతల నుండైతే వినపబలేదు. మరి అదే డేట్ నా రిలీజ్ చేస్తారా? లేక బాహుబలి కి రెడ్  కార్పెట్ పరిచి తమ సినిమాను వాయిదా వేసుకుంటారా అనేది మాత్రం వేచిచూడాలి. మొత్తానికి  తెలుగు సినిమాలకు బాహుబలి గండం పట్టుకుందన్న మాట!!

kick2

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top