పనిచెయ్ ఫలితం ఆశించకు అంటారే…దానికి ఉదాహరణే ఇది.

అనగనగా ఒక రాజు.ఆ రాజు తన దగ్గరున్నముగ్గురు సైన్యాధ్యక్షులను పిలిపించాడు. వారు వచ్చి రాజు ముందు చేతులు కట్టుకొని రాజా ఆజ్ఞా అంటూ నిల్చున్నారు. అప్పుడు ఆ రాజు వాళ్లతో మీరు ముగ్గురు తోటలోకి వెళ్లి..మంచి మంచి పండ్లతో ఒక్కొక్క సంచి  నింపుకొని రావాలి అని ఆర్డర్ వేశాడు. అప్పుడు  ముగ్గురు సైన్యాధ్యక్షులు తలా ఓ సంచి తీసుకొని తోటలోకి ప్రవేశించారు.

మొదటి సైన్యాధ్యక్షుడు:

రాజు గారి ఆజ్ఞ ప్రకారం మంచి, మంచి పండ్లతో నా సంచిని నింపుకొని వెళతాను. నా పనిని చూసి రాజా వారు మెచ్చుకోవాలి. అనుకొని ప్రతి చెట్టుకు ఉన్న మంచి మంచి పండ్లను తెంచి తన సంచిని నింపాడు.

రెండవవాడు:

హా…రాజుగారి ఒక్కొక్క పండును పట్టుకొని చూస్తారా ఇది మంచిదా? ఇది చెడ్డదా? అని చేతికి దొరికిన పండును దొరికినట్టు తెంచి సంచిని నింపేశాడు. సంచిలో కొన్ని మంచి పండ్లు, ఇంకొన్ని చెడిపోయినవి, మరికొన్ని పచ్చివి. ఇంకొన్ని బాగా పండినవి ఉన్నాయ్.

మూడవవాడు:

రాజ్యాన్ని , ముగ్గురు భార్యలను చూసుకోడానికి రాజుగారికి టైమ్ చాలట్లే…అలాంటిది నే తెచ్చిన పండ్లను చూస్తాడా ఆ మనిషి అనుకొని తన సంచినంతా గడ్డితో నింపేశాడు.

మరుసటి రోజు ముగ్గురు సైన్యాధ్యక్షులను పిలిపించారు రాజా వారు. మంచి మంచి పండ్లు తెచ్చారా? సంచి నిండా తెచ్చారా? అని అడిగాడు .దానికి వాళ్లుముగ్గురూ తమతమ తలలను ఓ.యస్ అన్నట్టు ఊపారు. వెంటనే రాజావారు ఎవరక్కడ అన్నాడు.. చిత్తం అంటూ నలుగురు భటులు వచ్చారు. వెంటనే ఈ ముగ్గుర్ని మూడు నెలల పాటు కారాగారంలో ఉంచండి అన్నాడు. రాజు చెప్పినట్టు భటులు  ఈ ముగ్గురుని వారివారి సంచులతో సహా ఒక్కొక్క జైలు గదిలో బంధించారు.

సాయంత్రం కాగానే ఆకలి స్టార్ట్ అయ్యింది. ముగ్గురిలో మొదటి వాడు తాను తెంచిన పండ్లలో మంచి పక్వానికి వచ్చిన పండ్లను తినడం స్టార్ట్ చేశాడు. రెండవ వాడు కూడా తన పండ్లను తినడం స్టార్ట్ చేశాడు. మూడవ వాడు కూడా ఆకలికి తట్టుకోలేక తన సంచిలోని గడ్డిని తినడం స్టార్ట్ చేశాడు.

  • మూడు రోజుల తర్వాత మూడవ వాడు చనిపోయాడు- అతను తిన్న గడ్డి అరగక
  • నెల రోజుల తర్వాత రెండవ వాడు చనిపోయాడు- పాడయిపోయిన పండ్లను తిని అనారోగ్యంతో.
  • మూడునెలల తర్వాత- మొదటి వాడు మరింత అందంగా జైలు నుండి విడుదలై బయటికి వచ్చాడు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top