ఏ ఇంట్లో అయితే చిన్నపిల్లలుంటారో ఆ ఇంట్లో ఆనందాలకు కొదువుండదు..పిల్లలు పుట్టిన దగ్గర్నుండి పెరుగుతున్న క్రమంలో ఎన్నో సంతోషాలు ఆ ఇంట్లో వెల్లివిరుస్తాయి.బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు,అత్త ,తాత ,అమ్మా అంటూ చిట్టి పొట్టి పలుకులు పలుకుతున్నప్పుడైతే అమ్మానాన్న సంతోషాలకు అవధులుండవ్.ఒకప్పుడు పిల్లలు పుడితే మూడు నెలల వరకూ కళ్లు తెరిచి చూసేవారు కాదట ..ఇప్పుడేమో పుట్టగానేనవ్వేస్తున్నారు.చుట్టుపక్కల వాళ్లని గుర్తుపట్టేస్తున్నారు..మాటలు,అల్లరి ,నడక అన్నీ ఫాస్టే…4జి పిల్లలు..అంటే వీళ్లేనేమో అనిపిస్తున్నారు..అలాంటి పిల్ల గురించే ఇప్పడు మనం చెప్పుకుంటున్నాం..
పేరు లాస్య ,వయసు నాకు తెలిసి రెండేండ్ల లోపే అనుకుంటా పళ్లు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి..ఆ పాల పళ్లతో బీరకాయ ముక్కల్ని కసకస నములుతూ..బీరకాయ ఇవ్వు బీరకాయ ఇవ్వు అంటూ అమ్మని అడుగుతూ… నాన్న అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలిస్తూ… ఆ వీడియో చూస్తుంటే చాలు అమాంతం ఆ బుజ్జిదాన్ని ఎత్తుకుని ముద్దులు పెట్టేయాలనిపిస్తుంది.ఎ ఫర్ యాపిల్,బి ఫర్ బాల్,సి ఫర్ క్యాట్ అంటూ…. ఎమ్ వరకు వచ్చేసరికి మర్చిపోయా… మర్చిపోయా అంటూ తను ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉందో..కావాలంటే మీరూ చూడండి..
watch video here:
ఏ ఫర్ ఆపిల్ బీ ఫర్ బీరకాయ ………Like & Share www.teluguquotes.com
Posted by Telugu Quotes on Thursday, 5 November 2015
ఇదే పాపది ఇంకో వీడియో ఇంతకన్నా చిన్నప్పటిది ఒకటి ఉంది ..ఆ వీడియో కూడా చూడండి…