ఆత్మవిశ్వాసం కాస్త తగ్గినట్టు అనిపిస్తే.. ఈ పాట వినండి.

మీలో ఎప్పుడైన ఆత్మవిశ్వాసం తగ్గిందా…? నేనెందుకూ పనికిరానని మీలో  మీరెప్పుడైనా ఫీల్ అయ్యారా…? ఎంట్రా ఈ జీవితం అంటూ మిమ్మల్ని మీరే తిట్టుకున్నారా…? కాలం కలిసి రాట్లేదని కోపగించుకున్నారా..? విధి రాత ఇంతే అని ఏవగించుకున్నారా..? అయితే ఒక్కసారి ఈ పాట వినండి…. మనలో వేయి ఓల్ట్ ల కరెంట్ పుట్టించి… గమ్యం వైపు పరుగులు పెట్టిస్తుంది. మనకంటే తోపెవ్వడూ లేడిక్కడ అని మనల్ని కార్యోముఖుల్ని చేస్తుంది…. పదండి ముందుకు పదండి తోసుకు అంటూ వెనకాలే ఉండి వెన్నుతట్టినట్టు అనిపిస్తుంది.

ఓ సారి ఆ పాటను వినండి…విన్న తర్వాత మీ భావాలు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి.:

ఆరంభమౌ ప్రచంఢమైన  యుద్దమే అఖండమైన శంఖరావలాపనే పూరించుదాం.
జాతి ప్రీతి గాంచె ఖ్యాతి పదములోన యుద్దరీతి నీతిగానే విజయం సాధించుదాం.
తుది సమరమే ఆరంభం.
తలచినంత ప్రాణార్పణ, తెగువ తేల్చు సంఘర్షణ, సమరానికి సిద్దమెప్పుడు వీరుడు..
కృష్ణగీత సారమిది, దైవ శాసనాలమిదే..యుద్దానికి జంకడెప్పుడు యోధుడు.
అనునయులే ఎదురించిన, సహచరులే వారించిన ధర్మానికి బద్దుడెప్పుడు ధీరుడు
తలవంచని స్వభావాలు, రాజసమే ఆనవాలు, ఒడిదుడులకు ఎదురేగే తత్త్వము..
అలుపెరుగని సాహసాలు ఎగిరే ఇక బావుటాలు…నలుదిక్కులు చాటు ఆదిపత్యము.

ఈ పల్లవిని మించిన లిరిక్స్…చరణాల్లో ఉన్నాయ్ ఓ సారి వినండి.

Watch Song:

Comments

comments

Share this post

scroll to top