గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ ను ద‌త్త‌త తీసుకున్న హీరోయిన్.! సెలెబ్రిటీలు ద‌త్త‌త తీసుకున్న గ్రామాలు – వాటి అభివృద్ది.!?

అప్పుడెప్పుడో శ్రీమంతుడు సినిమా త‌ర్వాత గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకునే కార్య‌క్ర‌మానికి తెర‌లేపారు సినీతార‌లు. త‌మ‌కు తెలిసిన, త‌మ మూలాలున్న గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకొని వాటి అభివృద్దికి స‌హాయ‌ప‌డుతూనే ఉన్నారు. తాజాగా తెలుగు హీరోయిన ప్ర‌ణీత కర్ణాటక లోని ఆలూర్ అనే గ్రామంలోఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను ద‌త్త‌త తీసుకుంది. ద‌త్త‌త కార్య‌క్ర‌మం అయిన వెంట‌నే ఓ 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఆ స్కూల్ అంద‌జేసి ఫ‌స్ట్ బాలిక‌ల‌కు మూత్ర‌శాల‌లను ఏర్పాటు చేయాల‌ని స్కూల్ హెడ్ మాస్ట‌ర్ ను కోరింది. విద్యార్థుల అభివృద్దికి త‌న వంతు స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తాన‌ని పేర్కొంది.

చాల మంది సెలేబ్రిటిలు మన దేశంలోని కొన్ని గ్రామాలను దత్తతు తీసుకున్నారు , వారి వివారాలు ఇలాగ ఉన్నాయి.

మ‌న సినిమా సెలెబ్రీలు ద‌త్త‌త తీసుకున్న గ్రామాల వాటి అభివృద్ది గురించి చూద్దాం.

  • మ‌హేష్ బాబు – సిద్దాపురం ( తెలంగాణ ) & బుర్రిపాలెం ( ఆంద్ర ప్ర‌దేశ్ ). బుర్రిపాలెంలో అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేసినంత‌గా సిద్దాపురంలో చేయ‌లేదు ప్రిన్స్ .
  • మురళి మోహ‌న్- రంగాపురం ( ఆంద్ర ప్ర‌దేశ్ ). & న‌డిగూడెం ( తెలంగాణ ). రెండు గ్రామాల్లో కూడా ఆశించిన రీతిలో అభివృద్ది కార్య‌క్ర‌మాలేవీ జ‌ర‌గ‌లేదు.
  • ప్ర‌కాశ్ రాజ్ – కొండ్రెడ్డిప‌ల్లి.( మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ) 100 ప‌ర్సెంట్ ఎఫ‌ర్ట్ పెట్టి త‌ను ద‌త్త‌త తీసుకున్న గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది ప‌థంలో న‌డిపిస్తున్నాడీ విల‌క్ష‌ణ న‌టుడు.
  • సుమ‌న్ – సుద్ద‌ప‌ల్లి ( మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా) . తెలంగాణ గ్రామ జ్యోతి అనే కార్య‌క్ర‌మంతో స్పూర్తి పొందిన సుమ‌న్ ఇటీవ‌లే సుద్ద‌ప‌ల్లి అనే గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నాడు.
  • మంచు విష్ణు– ( చిత్తూరు జిల్లాలోని 5 గ్రామాలు) ఆర్మీ గ్రీన్ ప్రోగ్రామ్ పేరు మీద ….త‌న సొంత చిత్తూరు జిల్లాలో విష్ణు 5 గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్నాడు.

Comments

comments

Share this post

scroll to top