రవి తేజ తమ్ముడి ఘటన మరవకముందే…ఆక్సిడెంట్ లో మరో వర్ధమాన తెలుగు హీరో మృతి..!

ఇటీవలే మృతి చెందిన సినీ నటుడు రవితేజ తమ్ముడు భరత్ రాజు ఘటన మనమింకా మరవక ముందే తెలుగు సినీ పరిశ్రమ మరో యువ హీరో ని పోగొట్టుకుంది. రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ ఘటన బిబి నగర్ వద్ద చోటు చేసుకుంది. వరంగల్‌ రైల్వేగేట్‌ ప్రాంతం 18వ డివిజన్‌ శివనగర్‌కు చెందిన సరోహా రూపేష్, ఫరిజానా(ఫాతిమా) దంపతులకు ఇద్దరు కుమారులు అస్లాం (ఖరన్‌సింగ్‌) (21), సల్మాన్‌ఉన్నా రు.

మూడేళ్ల కిత్రం చిన్నపాటి ఉద్యోగం చేసేందుకు అస్లాం హైదరాబాద్‌కు వెళ్లాడు. సినిమా పై మక్కువ తో కష్టపడి ఒక సినిమాలో హీరో గా ఎంపికయ్యాడు. ప్రేమమయం సినిమాకు హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. వచ్చే నెల సినిమా విడుదల కానుంది.

రంజాన్‌ పండుకు అస్లాం హైదరాబాద్‌ నుంచి శివనగర్‌లోని తన ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం కాజీపేటకు చెందిన తన బాల్యమిత్రుడితో కలిసి ఇద్దరు ద్విచక్రవాహనంపై హైదారాబాద్‌కు బయల్దేరారు. ఈక్రమంలో హన్మకొండ–హైదరాబాద్‌ ప్రధాన జాతీయ రహదారిపై బిబీనగర్‌ సమీపంలో ద్విచక్రవాహనం ఆదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో అస్లాంకు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా అతడి మిత్రుడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు సికిందరాబాద్‌లోని ఎంజీఎంకు తరలించారు. అస్లాం మృతదేహం పోస్టుమార్టం పూర్తి చేసుకుని గురువారం సాయంత్రం శివనగర్‌లోని తన స్వగృహానికి చేరుకుంది. ఈరోజు అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.

 

Comments

comments

Share this post

scroll to top