తెలుగులో హవా తగ్గిపోయిన 6 మంది హీరోయిన్స్ వీరే..! టాలెంట్ తో మెప్పించారు కానీ అవకాశాలు మాత్రం!

సినిమా ప్రపంచం అంతా మిధ్య..ఇక్కడ ఒక హిట్ తో ఓవర్ నైట్ స్టార్ అయినవారూ ఉంటారు..ఒక ప్లాప్ తో స్టార్ డమ్ పోయి అవకాశాలు లేక కనుమరుగైనవారూ ఉంటారు..ముఖ్యంగా హీరోయిన్లు..హీరోయిన్ల విషయంలో ఒకప్పుడు లా లేదు..చాలామంది ఒకట్రెండు సినిమాలకే వెనుదిరుగుతున్నారు.. కొంతమంది మంచి హిట్స్ తమ ఖాతాలో ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం చేతిలో లేక వేరే పరిశ్రమల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడమో..చదువుల పేరుతో ఇండస్ట్రీకి దూరం ఉండడమో ,పెళ్లి చేసుకుని పూర్తిగా ఇండస్ట్రీని వదిలేయడమో చేస్తున్నారు..అలాంటి హీరోయిన్లలో కొందరు..

త్రిష:

దశాబ్దంకు పైగా తెలుగు సినిమాలో స్టార్ గా వెలుగొందింది హీరోయిన్ త్రిష. వర్షం, నువ్వొస్తానంటే వద్దంటానా, అతడు.. ఇలా అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ తో తెలుగులో దాదాపు జూనియర్, సీనియర్ హీరోలందరితో నటించిన ఈ భామ చేతిలో ప్రస్తుతం ఒక సినిమా కూడా లేదు. లయన్‌, నాయకి సినిమాలతో టాలీవుడ్ ఆమెకు టాటా చెప్పింది. ప్రస్తుతం త్రిష తమిళ, మలయాళ సినిమాలను నమ్ముకుంది.

శృతిహాసన్;

తెలుగులో గబ్బర్‌సింగ్‌ తో హిట్టందుకున్న శృతిహాసన్ కి అప్పటివరకూ ఐరన్ లెగ్ అనే పేరు..గబ్బర్ సింగ్ తర్వాత ఒకసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది..ఆ తర్వాత  రేసుగుర్రం, ఎవడు, శ్రీమంతుడు, ప్రేమమ్‌ వంటి వరుసగా హిట్స్ అందుకున్న శృతి హాసన్ కి సడన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో శభాష్‌నాయుడు చిత్రం మాత్రమే ఉంది. ఇది కూడా స్ట్రైట్ తెలుగు చిత్రం కాదు.

ప్రియా ఆనంద్:

లీడర్‌ లో ఆకట్టుకున్న ప్రియా ఆనంద్‌ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, 180 చిత్రాలతో ముందుకు వచ్చింది. మంచి హిట్ లేకుండా పోయింది. తెలుగులో కో అంటే కోటి చిత్రం తర్వాత తెలుగులో అవకాశాలే లేకుండాపోయాయి. దాంతో తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ, కెరీర్‌ను నడిపిస్తోంది.

అంజలి:

ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు..కానీ అంజలి రచ్చ గెలిచి ఇంట తానేంటో నిరూపించుకుంది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో సినిమాలు చేసి నిరూపించుకొని తెలుగు సినీరంగంలోకి వచ్చింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, గీతాంజలి వంటి చిత్రాలతో మెరిసిన అంజలికి అవకాశాలు తగ్గిపోయాయి. చిత్రాంగద చిత్రం తర్వాత ఆమె ఏ చిత్రానికి సైన్ చేయలేదు.

అవికా ఘోర్:

ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలో హీరోయిన్‌గా పరిచయమైన అవికా గోర్‌ తెలుగువారికి కనెక్ట్ అయింది.అంతకు ముందే చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో బాలనటిగా అవికా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.  సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి… మంచి నటిగా పేరు అందుకున్నప్పటికీ తెలుగు అవకాశాలు ఆమెకు దక్కడం లేదు..ఆ మధ్య పెళ్లి అంది..చదువంది..ఏ విషయం తెలియలేదు.

ప్రణీత:

కెరీర్ మొదట్లో హిట్స్ పలకరించకపోయిన అత్తారింటికి దారేది తో ప్రణీత వెలుగులోకి వచ్చింది. ఇక జోరుగా సినిమాలు చేస్తుందనుకుంటే బ్రహ్మోత్సవంతో ఆగిపోయింది. ఆ తర్వాత ఆమె తెలుగులో సినిమా చేయలేదు.

వీళ్లల్లో మళ్లీ ఎవరు ఏ హిట్ తోస్టార్ గా ఎదుగుతారో..లేదంటే పూర్తిగా కనుమరుగవుతారో వారి అదృష్టమే చెప్తుంది..ఎందుకంటే సినిపరిశ్రమలో అవకాశాలతో పాటు అదృష్టమూ అప్పుడప్పుడు కలిసొస్తుంది మరి..

Comments

comments

Share this post

scroll to top