తెలుగు డైరెక్టర్ కు మోడీ ఫోన్…..

ఓ ఫైన్  మార్నింగ్ సాక్షాత్తు  దేశ ప్రధాని నుండి సడన్ గా మీకు ఫోన్ వస్తే ఎలా ఫీల్ అవుతారు.ఉబ్బితబ్బిబవుతారు కదా ! తెలుగు దర్శక నిర్మాత కూడా అంతే అవాక్కయ్యాడు..  ఫోన్ లిఫ్ట్ చేయగానే ..  హలో మై ఢిల్లీ సే  నరేంద్ర మోడీ బాత్ కర్ రహా హూ అని అని వినిపించగానే ఒక్క క్షణం  ఇది కళాలేక నిజమా అని  తేరుకోలేకపోయాడు. అలా ఫోన్ చేసిన వ్యక్తి సదరు దర్శక నిర్మాత  తండ్రి యోగ క్షేమాలను కూడా  స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఇంతకు ఆ దర్శక నిర్మాత ఎవరంటే … బుద్ధుడి జీవితం పై ‘గౌతమ్ బుద్ధ’ లాంటి అవార్డు సినిమాను నిర్మించిన వ్యక్తి. అంతే  కాకుండా పవన్ కళ్యాణ్ తో ‘తమ్ముడు’  సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర ను కూడా పోషించాడు… అతనే రాజ్ కందుకూరి.. అసలు ఇతనికి మోడీ ఉన్న లింక్ ఏంటనే కదా మీ సందేహం….  అసలు  వివరాలలోకి వెళితే రాజ్ కందుకూరి తండ్రి శ్రీ శివానంద మూర్తి ఒక ప్రముఖ సద్గురు. మాజీ ప్రధాన మంత్రి వాజ్ పాయ్ దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు చాలామంది శివానంద మూర్తికి శిష్యులు. ప్రధానమంత్రి మోడీకి కూడా శివానంద మూర్తి అంటే చాల గౌరవం.

raj

అటువంటి శివానంద మూర్తికి గత కొద్ది కాలంగా ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు అని తెలుసుకున్న ప్రధానమంత్రి మోడీ దర్శకుడు రాజ్ కందుకూరికి స్వయంగా ఫోన్ చేసి శివానంద మూర్తి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని రాజ్ కందుకూరి వద్ద నుండి తెలుసుకోవడం కోసం కాల్ చేశారంట.. అవసరమైతే వైద్య ఖర్చులు కూడా  భరిస్తానని భరోసా కూడా ఇచ్చారంట!!!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top