తెలుగు ఛాన‌ల్స్ – వాటి అధిప‌తులు.!?

ఒకప్పుడు టివి చూడాలంటే దూరదర్శన్ ఒకటే..కానీ ఇప్పుడు వందల సంఖ్యలో ఛానెల్స్.. ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్,న్యూస్ ఛానెల్స్ లెక్కలేనన్ని..ఒకదానికొకటి విపరీతమైన పోటీ..ఆ పోటీని తట్టుకుని మార్కెట్లో నిలదొక్కుకోవడానికి అవి చేయని ప్రయోజనం అంటూ ఉండదు..ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రోగ్రాంస్ ని మనకు అందిస్తున్నారు..ఇన్ని ఛానెల్స్ వచ్చినా కొన్ని ఛానెల్స్ మాత్రం చాలా పాపులర్ అయ్యాయి.. ఆ ఛానెల్స్ ఎవరు ,ఎప్పుడు ప్రారంభించారు.. ఆ ఛానెల్స్ అధినేతలు ఎవరనేది మాత్రం మనకు తెలీదు..వారెవరో తెలుసుకోండి..

MAA TV:

పెన్మెత్మ మురళీ క్రిష్ణంరాజు మొదట మా టివిని ప్రారంభించారు..ఆ తర్వాత  నిమ్మగడ్డ ప్రసాద్ దీన్ని సొంతం చేసుకున్నారు.చిరంజీవి,నాగార్జున ఈ ఛానెల్లో షేర్స్ కలిగి ఉన్నారు..ఈ మధ్య మాటివిని స్టార్ నెట్వర్క్  కొనుగోలు చేసింది..స్టార్ నెట్ వర్క్  CEO ఉదయ్ శంకర్..ఇప్పుడు మా టివి బాద్యతలు చూసేది స్టార్ నెట్వర్క్ సౌత్ రీజియన్ హెడ్ సయ్యద్ కెవిన్.

GEMINI:

రెండు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న జెమిని టివి మొదట ప్రారంభమయింది తమిల్లో..తెలుగులో 1995లో ప్రారంభించారు.కళానిది మారన్ జెమిని గ్రూప్స్ ని ప్రారంభించారు..కె.విజయ్ కుమార్  CEO గా ఉంటే ..కె.సుబ్రహ్మణ్యం బిజినెస్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు.

Zee Telugu:

జి ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లో భాగం అయిన జి తెలుగు అనురాధ బిజినెస్ హెడ్ గా,పూనమ్ గోయెంకా CEO గా వ్యవహరిస్తున్నారు.

 

ETV:

ఈనాడు పేపర్ అధినేత రామోజిరావు 1995లో ఈటివిని ప్రారంభించారు.అత్యధికంగా సర్క్యులేట్ అయ్యే పేపర్ గా ఈనాడుకి పేరుంది..తెలుగులో ప్రారంభమయిన ఈ టివి తర్వాత అన్ని లోకల్ భాషల్లోనూ వచ్చింది..

V6:

Vil  మీడియా ప్రైవేట్ లిమిటెడ్ 2012 మార్చిలో వి6ఛానెల్ ను ప్రారంభించింది..ఈ ఛానెల్ CEO  గా అంకం రవి వ్యవహరిస్తున్నారు.

10TV:

ప్రజల పెట్టుబడితో ప్రారంభయిన టెన్ టివి 2013మార్చిలో ప్రారంభయింది..దీనికి ఎండి గా ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వ్యవహరిస్తున్నారు.ఈ ఛానెల్లో షేర్స్ కలిగిఉన్నవారు..రోజువారి కూలిలు,టీచర్లు,డాక్టర్లు అనే తేడా లేకుండా..అందరూ తమకు తోచినంత డబ్బుకట్టి షేర్స్ కలిగిఉన్నారు.

TV9:

2003లో ప్రారంభమయిన టివి9 నంబర్ వన్ న్యూస్ ఛానెల్ గా దూసుకుపోతుంది..టివి9 ప్రారంభమయిన నాటి నుండి రవిప్రకాశ్ సిఇఒ గా ఉన్నారు..ఇతర లాంగ్వెజెస్ లో కూడా టివి9 న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి..

HMTV:

హెచ్ ఎమ్ టివి కి సిఇఓగా శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నారు.

 

NTV:

2007,ఆగస్టులో ప్రారంభమయిన ఎన్టివీ..తెలుగు న్యూస్ ఛానెల్..ఎన్టీవి దక్షిణ భారతదేశంలో మొదటి డివోషనల్ ఛానెల్.. భక్తి ఛానెల్ ను ప్రారంభించింది.ఎన్టీవి చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి.

SAKSHI:

ఇందిర టెలివిజన్ లిమిటెడ్ ఆద్వర్యంలో 2009 లో ప్రారంభమయిన సాక్షి టివి చైర్మన్ వై.ఎస్ .భారతి.

Comments

comments

Share this post

scroll to top