ఫ్రెండ్ షిఫ్ …అనగానే గుర్తుకొచ్చే పాటలు. మీ కోసం!

స్నేహం అదో అనిర్వచనీయ బంధం… నాలుగు కోటేషన్లు చెప్పి ఇదే స్నేహం అంటూ పది మాటల్లో ఇరికించే వస్తువు అసలే కాదు. .. నేనున్నారా అనే భరోసా.  చల్ హమ్ హై తేరే సాత్ అని వెనుక నుండి మనల్ని అందలాలకు ఎక్కించే పుష్ అప్. మనం  ఎడిస్తే  వారి కంట్లో నీళ్లు ధారలుగా  కారతాయి, మన కాలిలో ముళ్లు గుచ్చుకుంటే..  అది వాళ్ళ హృదయానికి మేకుల్లా గుచ్చుకున్న ఫీలింగ్ …  మనం ఎదుగుతుంటే  ఆ చేతులు  ఎగబడి చప్పట్లు కొడతాయ్… కిందపడుతుంటే స్టెప్నీలా అడ్డుకుంటాయ్.  ఇంక కరెక్ట్ గా స్నేహం గురించి వర్ణించాలంటే…  ఇళయరాజా  మ్యూజిక్ కావాలి, వేటూరి లిరిక్స్ కావాలి.

అవి ఇప్పటికిప్పుడు మీకు అందించలేము కానీ…. స్నేహం అంటే గుర్తుకు వచ్చే ఆణిముత్యాల్లాంటి పాటలను ఏరి కోరి మీకందించగలం.

1) ముస్తఫా..ముస్తఫా

2) ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.

3) పాదం ఎటు పోతున్నా.. పయనం ఎందాకైనా

4) నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా…

5) కొంత కాలం కిందట  బ్రహ్మ దేవుడి..

6) ట్రెండు మారిన ఫ్రెండ్ మారడు

ఇవి ఫ్రెండ్ షిప్ ను కరెక్ట్ గా ఎక్స్ ప్రెస్ చేసిన సాంగ్స్ అని మా అభిప్రాయం.. మరి మీకు ఏ సాంగ్ నచ్చింది.  ఇవే కాక స్నేహానికి సంబంధించిన మంచి పాటలుంటే మాకు సూచించండి!

Comments

comments

Share this post

0 Replies to “ఫ్రెండ్ షిఫ్ …అనగానే గుర్తుకొచ్చే పాటలు. మీ కోసం!”

  1. Satish Satish says:

    mustafa mustafa alwz top song for friendship forever

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top