మన బ్యూటీస్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

సినిమాల్లో ఉన్న ప్రముఖులు చాలా మంది సినిమాల మోజులో పడి పెద్దగా చదువుకోరని చాలా మంది అనుకుంటారు. సినిమాల్ో రాణించాలంటే చదువుతో పెద్దగా అవసరం లేదని అందం, అభినయం ఉంటే చాలు అని కొందరి అభిప్రాయం. అయితే ఇది కొంత వాస్తవమే అయినా అందరి విషయాల్లో ఇలా జరగదు. హిరోల కంటే హిరోయిన్లు ఇంకా తక్కువే చదువుతారని అందరూ అనుకుంటారు. ఎందుకంటే హిరోయిన్స్ మోడలింగ్ మోజులో పడి పెద్దగా చదువుకొరని వారి టైం అంతా మోడలింగ్ చుట్టూ తిరగడానికే సరిపోయి ఉంటుందని భావిస్తారు. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.టాలీవుడ్ హిరోయిన్లలో టాప్ పోజిషన్ ఉన్న వాళ్లు మంచి ఉన్నత చదువులు చదివిన వారే.

ఎవరేవరు ఏమేం చదువులు చదువుకున్నారో ఒక్కసారి పరిశిలిస్తే…

అక్కినేని ఇంటి కోడలు చైతుని మాయ చేసిన సమంత చెన్నెలోని స్టెల్లా మేరీస్ కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదివింది.
మగధీర సినిమాతో టాలీవుడ్ ని షేక్ చేసిన మిత్రవింద కాజల్ అగర్వాల్ బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా చేసింది. ముంబైలోని కేసీ కాలేజ్ లో తన చదువుని పూర్తి చేసింది.
కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి తన ప్రాపర్ అయినా బెంగుళూరులో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తి చేసింది.బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్ లో తన చదువుని పూర్తి చేసింది ఈ అరుంధతి.
రెజీనా – గ్రాడ్యుయేషన్ ఇన్ సైకాలజీ (ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్, చెన్నై)

మిల్కీ బ్యూటీ తమన్నా ముంబైలోని నేషనల్ కాలేజ్ లో బీఎ చదివింది.

గ్లామర్ యాక్టర్ శ్రియా శరన్ ఢిల్లీలోని శ్రీరాం ఉమెన్స్ కాలేజ్ లో బిఏ లిటరేచర్ చేసింది.
హైదరాబాదీ హిరోయిన్ రీతువర్మ హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చేసింది.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ డిగ్రీ ఇన్ మేథమేటిక్స్ చేసింది. ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాలేజ్ లో తన చదువుని పూర్తి చేసింది.

యాంకర్ గా పరిచయమై అంచెలంచెలుగా హిరోయిన్ స్థాయి వరకు ఎదిగిన తెలుగు హిరోయిన్ స్వాతి డిగ్రీలో బయోటెక్నాలజీ చదివింది.
మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ఓక్లహోమా సిటీ యూనివర్సిటీలో డిగ్రీ ఇన్ థియేటర్ ఆర్ట్స్ అనే కోర్సు చదివింది.
పొడుగు కాళ్ల సుందరి ఇలియానా గ్రాడ్యుయేషన్ చేసింది వాణిజ్య రాజధాని ముంబై యూనివర్సిటీలో ఈ కోర్సు చేసింది.
కమల్ హసన్ కూతురు శ్రుతిహాసన్ సైకాలజీ చేసింది .

ఫిదా సినిమాతో అందరిని ఫిదా చేసిన కేరళ కుట్టి సాయి పల్లవి మెడికల్ చేసింది.
తెలుగుదనం ఉట్టి పడేలా ఉండే మహనటి
కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేసింది
తన పిల్లి కళ్లతో కుర్రకారుని మాయ చేసిన రాశి ఖన్నా బీఎలో ఇంగ్లిష్ చేసింది.

డీజే సినిమాతో తన అందచందాలతో కుర్రకారు మతి పోగొట్టిన పూజా హెగ్డే ముంబైలో మాస్టర్స్ ఆఫ్ కామర్స్ చదివింది.

Comments

comments

Share this post

scroll to top