ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్.. ఇప్పటికే సగం టోర్నమెంట్ పూర్తయింది. దీంతో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీంలు ఏవో అందరికీ తెలిసిపోయాయి. ఏదైనా విచిత్రాలు జరిగితే తప్ప పాయింట్స్ టేబుల్లో చివరి స్థానాల్లో ఉన్న టీంలు పైకి ఎగబాకే పరిస్థితి లేదు. ఈ క్రమంలో మరో వైపు ఆయా టీంలకు తమ అభిమానుల నుంచి గట్టి మద్దతు కూడా వస్తోంది. ఏ సిటీకి చెందిన అభిమానులు ఆ సిటీ ఐపీఎల్ టీంకు మద్దతు పలుకుతున్నారు. కానీ హైదరాబాద్ వాసి అయి ఉండి బ్యాడ్మింటన్ ఛాంపియన్ కిదాంబి శ్రీకాంత్ చెన్నై టీంకు సపోర్ట్ పలికాడు. దీంతో హైదరాబాద్ వాసులు ఇప్పుడు శ్రీకాంత్‌ను టార్గెట్ చేసి నెట్లో విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
కిదాంబి శ్రీకాంత్‌కు ఈ మధ్యే చెన్నై సూపర్ కింగ్స్ టీం ప్రత్యేకమైన జెర్సీని పంపింది. తమ టీం జెర్సీలకు తగినట్టుగానే దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి శ్రీకాంత్‌కు చెన్నై టీం జెర్సీని బహుకరించింది. దీంతో ఆ జెర్సీని అందుకున్న శ్రీకాంత్ దాంతో ఫొటో దిగి దాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. అందులో థాంక్యూ చెన్నై సూపర్ కింగ్స్, నాకు టీ షర్ట్ పంపినందుకు, ఈ రోజు సాధించండి, మీకు నా సపోర్ట్ ఉంటుంది.. అని కామెంట్ పెట్టాడు.
Thank you Chennai Super Kings for the tshirt. Let’s get this today. pic.twitter.com/0lQEMIATmh
— Kidambi Srikanth (@srikidambi) April 30, 2018
అయితే కిదాంబి శ్రీకాంత్ అలా కామెంట్ పెట్టడంపై తెలుగు వారు అతనిపై విరుచుకుపడుతున్నారు. తెలుగు వాడివి అయి ఉండి చెన్నై టీంకు సపోర్ట్ చేయడమేమిటని శ్రీకాంత్‌ను సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. అతన్ని అందులో ట్రోల్ చేస్తున్నారు. అయితే గత కొంత కాలం కిందటే తాను సన్‌రైజర్స్ సపోర్టర్నని, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్‌లు అంటే ఇష్టమని శ్రీకాంత్ ప్రకటించాడు. అంతేకాదు, తాను హైదరాబాద్ టీంకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతలోనే శ్రీకాంత్ మాట మార్చడంపై అందరూ అతన్ని విమర్శిస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు..?