కార్ యాక్సిడెంట్స్ నుండి తృటిలో ప్రాణాలు దక్కించుకున్న సినీ నటులు.!

సినీ నటులంటేనే బిజీ షెడ్యూల్…అటు నుండి ఇటు, ఇటు నుండి అటు ప్రయాణాలే ప్రయాణాలు….షూటింగ్స్ హడావుడి, పర్సనల్ పనులు ఇలా నిత్యం ఏదో ఓ పని మీద రోడ్డు మీద తిరుగుతూనే ఉంటారు. అయితే మన సినిమా నటులలో చాలా మంది ఇలా ప్రయాణిస్తూ యాక్సిడెంట్ కు గురై  తృటిలో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడిన వారు చాలా మందే ఉన్నారు.  వారి గురించి ఇప్పుడు తెల్సుకుందాం.

జూనియర్ NTR:
TDP తరఫున ఎన్నికల ప్రచారం చేసి..హైద్రాబాద్ కు రిటర్న్ అవుతున్న NTR కార్, సూర్యాపేట సమీపంలోని మోతే వద్ద  కుక్కను తప్పించబోయి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో NTR కు తీవ్ర గాయాలయ్యాయి.

junior-ntr-accident-photos-300x249

ప్రకాశ్ రాజ్:
2014 ఆగస్ట్.. ప్రకాశ్ రాజ్ తన బెంజ్ కార్ లో మాదాపూర్ నుండి శిల్పారామం వెళుతున్నాడు, హైటెక్ సిటి ఫ్లై ఓవర్ దగ్గర ఎదురుగా వస్తున్న RTC బస్ ప్రకాశ్ రాజ్ ప్రయాణిస్తున్న కార్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రకాశ్ రాజ్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది.

బాలకృష్ణ:
జూన్ 29,2016.
పార్టీ మీటింగ్ ముగించుకొని తన కార్ లో బెంగుళూర్ వెళుతున్న బాలకృష్ణకు కర్నాటక లోని బాగేపల్లి వద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఆయన ప్రయాణిస్తున్న కార్..డివైడర్ ఎక్కింది. ఈ ప్రమాదం నుండి బాలకృష్ణ సురక్షితంగా బయటపడ్డారు.

maxresdefault

ఖయ్యుం:
ఔటర్ రింగ్ రోడ్డులోని కొహెడ సమీపంలో అలీ తమ్ముడు ఖయ్యుం ప్రయాణిస్తున్న కార్ ను టిప్పర్ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటన నుండి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు ఖయ్యుం.

khayyum-injured

లయ:
అమెరికాలో స్థిరపడ్డ లయ… కాలిఫోర్నియా నుండి లాస్ ఎంజెల్స్ కు వెళ్తున్న సందర్భంలో ఆమె ప్రయాణిస్తున్న కార్ కు యాక్సిడెంట్ అయ్యింది. లయ చనిపోయిందని చాలా పుకార్లు వచ్చాయి. వెంటనే తన సోషల్ మీడియా ద్వారా నేను క్షేమంగా ఉన్నానని లయ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

telugu-heroine-laya-met-with-car-accident-and-injured-in-usa-los-angeles

ప్రణీత:
తల్లితో సహా ఖమ్మం నుండి హైద్రాబాద్ ప్రయాణిస్తున్న ప్రణీత కార్ కు సూర్యాపేట సమీపంలోని మోతే వద్ద యాక్సిడెంట్ అయ్యింది.( సరిగ్గా జూనియర్ NTR కు యాక్సిడెంట్ అయిన ప్లేస్ లోనే ప్రణీతకు యాక్సిడెంట్ అయ్యింది!)

praneetha-car-accident-images-1-600x264

యశోసాగర్:

తన కొత్త సినిమా డ్రెస్ లకు సంబంధించిన షాపింగ్ నిమిత్తం బెంగుళూరు వెళ్లి తిరిగి వస్తున్న నవ హీరో  ఉల్లాసంగా ఉత్సాహంగా  ఫేమ్ యశో సాగర్ కార్  కర్నాటకలో  యాక్సిడెంట్ కు గురైంది ఈ ఘటన లో యశోసాగర్  ప్రాణాలు కోల్పోయాడు.

Car that hit a wall and killed Telugu actor Bharath alias Yashas Sagar on NH4 in Tumkur on Wednesday. –KPN

Comments

comments

Share this post

scroll to top